Saturday, June 29, 2013

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి

                      

నేను నా మిత్రులిద్దరూ కలిసి పార్టనర్లుగా ఒక కంపెనీ పెట్టాం.నా మిత్రులు తమ పదవి మర్చిపోయి కార్మికులతో స్నేహంగా ఉండేవారు.కార్మికుల్లో భయం అనేది లేకపోతే రేపు మన భుజం మీద చేయివేసి కబుర్లు చెప్పవచ్చు! పని దేబ్బతినవచు.అందువల్ల నేనుమాత్రం ఎప్పుడూ వాళ్ళతో గంభీరంగా మసలుకునేవాడిని.దీంతో నా మిత్రులకేమో మంచి పేరు,కంపెనీ కోసం కష్టపడుతున్న నాకేమో చెడ్డపేరు.ఇదేం న్యాయం?

నిజం చెప్పాలంటే మనుష్యుల్ని కటినమైనవాళ్ళు,మృదువైనవాళ్ళు అని విడదీసి చెప్పలేం! సంతోషంగా ఉండేవాళ్ళు,సంతోశంగాలేనివాళ్ళు అని మాత్రమే విడదీయగలం!
మీరు కటినంగాప్రవర్తిస్తున్నారంటే సంతోషం లేకుండా ఉన్నారని అర్థం.మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎక్కడ మీ నెత్తేక్కి కూర్చుంటారోనన్న సందేహమే మీ ఆనందాన్ని హరించేస్తుంది.

'నేను యజమాని ','అతడు పనివాడు' అనే ముద్రలు వేసుకోవడంవల్ల అహంకారం మొదలవుతుంది,అనుమానం పుడుతుని,ఆనందం అంతమవుతుంది.

ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు అతనితో కలిసి పనిచేయడం చాల సులభం.అదే వ్యక్తి ఆనందం పోగొట్టుకున్నాక అతనితో పనిచేయడం చాల కష్టం.

మీ కంపెనీకి లాభాలు వస్తున్నాయంటే,కార్మికులతో కలిసి మెలసి ఉంటున్న మీ స్నేహితులే తప్ప మీరు కారణం కాదు.ముందుగా ఎదుటివాళ్ళని తేలికగా చూసే గుణాన్ని మార్చుకుంటే మంచిది.

ఒక అడవిలో నాలుగు చీమలు వెళ్తున్నాయి.ఎదురుగా ఒక ఏనుగు వచ్చింది."రేయ్! వీడేంట్రా మన దారికి అడ్డు వస్తున్నాడు. చంపేద్దాం!" అంది ఒక చీమ.

"ఛీ చిన్నవాడు వాడితో ఏంటి? అయినా ఆ నాలుగు కాళ్ళు విరిచేస్తే బుద్ధి వస్తుంది" అంది రెండో చీమ.

మూడో చీమ, "అవన్నీ ఎందుకు వాణ్ణి అలా పక్కకు విసిరేసి మన దారిన మనం పోదాం" అంది. నాలుగో చీమ ఏనుగును ఫై నుంచి కిందికి ఓసారి చూసింది. "ఇది ఏం బాగోలేదు" మనం నలుగురం.వాడు ఒంటరివాడు.నలుగురు ఒకడితో యుద్ధం చేయడం ధర్మం కాదు, మన బలానికి చేటు,వీరానికి తక్కువ. అందువల్ల వాణ్ణి క్షమించి మనం పక్క నుంచి వెల్లిపోదాం" అంటూ పక్కగా మల్లిపాయింది.

మనం అనుకునేది నిజం, సరి అనే అహంకారం వస్తే ఈ చీమల్లాగే ఏనుగును కూడా తక్కువగా అంచనా వేసే గుణం మనకు అలవడుతుంది.

ఆటలో,కార్యలయమో,వ్యాపారమో...ఎక్కడైనా సరే, ఏ విభాగమైన సరే,అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.అందరూ చక్కగా పనిచేయాలంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. అప్పుడే,అక్కడ సంతోషం,ప్రశాంతత వుంటాయి.

అన్నిటా పోటీతత్వం ఎక్కువైన ఈ రోజుల్లో ఎదురుచూడకుండా వచ్చిపడే సమస్యలు ఎన్నోవుండగా,తోటి మనుషుల్ని మనకు సమస్యగా మార్చుకోవటం కంటే పిచ్చితనం మరేదన్నా ఉందా?

మీరు మీలానే ఉండండి

                          మీరు మీలానే ఉండకుండా మరొకరిలా ఉండలనుకుంతున్నారంటే
                       పరిణామక్రమంలో వెనుదిరిగి వెళ్ళి కోతిలా మారాలని అనుకుంటున్నారా?

'బిల్ గేట్స్ లా  ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కావాలన్న కోరిక,జీవితంలో గెలుపును కోరే యువకున్ని నేను.జీవితంలో ఎవరి దగ్గర చేతులు కట్టుకుని పని చేయాలని లేదు.స్వయం ఉపాధితో పైకొచ్చినవాళ్ళ జీవితాల గురించి అన్నో పుస్తకాలు చదివాను.విజయం సాదించినవాల్లను చూసి అలాగే ఉండాలనుకుంటున్నాను.అయిన ఏం జరగడంలేదు? ఎక్కడుంది తప్పు? అసలేం జరుగుతుంది?

మీ కోరిక మంచిదే! మీకు గొప్ప క్రికెట్ వీరుడు కావాలని ఆశ,అందువల్ల సచిన్ వేసుకునేలాంటి షూ వేసుకుంటారు.అతనిలాగే క్రాఫ్ చేయించుకుంటారు,సచిన్ తన బ్యాట్ ని మీకిస్తాడు.అయితే,వీటివల్ల మీరు అతనిలాగ ఆడగాలరా?

మరొకల్లలా నడుచుకుంటే మీరు గెలవగలరని ఎవరు చెప్పారు? మీ చాకచక్యాన్ని ,తెలివితేటల్ని ఎంత బాగా ఎలా ఉపయోగించుకోగలమని ఆలోచించడంలో కదా మీ గెలుపుంది! మరోకరిలా ఉండాలనుకున్తున్నావంటే వేనిదిరిగి వెళ్లి కోతిల మారాలనుకున్తున్నామని కదా అర్థం!

మీ జీవితాన్నలా ఎందుకు పాడుచేసుకుంటారు?

ఇలాగే ఓసారి శంకరన్ పిళ్ళై తన స్నేహితులిద్దరితో కలసి రైల్వేస్టేషన్ కి వెళ్ళాడు.ముగ్గురికీ కలిపి ఒక టికెట్ తీసుకున్నాడు.పల్లెటూరి నుంచి వచ్చిన ముగ్గురు దీన్ని చూసారు.ఒక్క టిక్కెట్ తో ముగ్గురు ఎలా ప్రయాణం చేయవచ్చు అని వాళ్ళకు ఆశ్చర్యం కలిగింది.రైల్లో వీళ్ళు శంకరన్ పిళ్ళై ను జాగ్రత్తగా గమనించసాగారు.

టిక్కెట్ కలెక్టర్ రావడం చూసి, శంకరన్ పిళ్ళై అతని స్నేహితులు టాయిలెట్ లోకి వెళ్లి దాక్కున్నారు.

మిగిలిన వాళ్ళను చూశాక, టిక్కెట్ కలెక్టర్ "లోపలఎవరు?  టిక్కెట్ ప్లీజ్" అని అడిగాడు.

లోపల నుంచి ఒక చేయి టిక్కెట్ జాపబడింది.ఆ తర్వాత కొంతసేపటికి ముగ్గురూ బయటికి వచ్చి కూర్చున్నారు.ఆ పల్లెవాల్లకు వీళ్ళ తంత్రం అర్థమైంది.

"అబ్బ ఎంత గొప్ప ఆలోచన" అనుకునారు.
వాళ్ళు తిరుగు ప్రయాణం మొదలెట్టారు.
ఆ ముగ్గురు కలిసి ఒకే టిక్కెట్ తీసుకునారు.
వెనకాలే   శంకరన్ పిళ్ళై తనమిత్రులతో వచ్చాడు. 

అయితే,ఈసారి  వాళ్ళు కనీసం ఒక్క టిక్కెట్ కూడా తీసుకోకుండా రైలెక్కడం చూసారు పల్లెవాళ్ళు.

వాళ్లకు ఒకటే ఆశ్చర్యం,ఎలా టిక్కెట్ కలెక్టర్ నుంచి తప్పించుకుంటారు అని వాళ్లకు అనుమానం.

టిక్కెట్ కలెక్టర్ ను చూడగానే పల్లెవాళ్ళు ముగ్గురూ టాయిలెట్ కు పోయి దాక్కున్నారు. శంకరన్ పిళ్ళై స్నేహితులు ఇద్దరూ దాంట్లో దాక్కున్నారు.పిళ్ళై  తలుపు తట్టి "లోపల ఎవరు? టిక్కెట్ ప్లీజ్" అన్నాడు.

ఒక పల్లెవాడు చేయి చాపాడు. శంకరన్ పిళ్ళై ఆ టిక్కెట్ తీసుకుని తన స్నేహితులతో దాక్కున్నాడు.

ఎదుటి వాళ్ళలాగ ఉండాలనుకుంటే, ఉన్నది కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్నప్పటి నుంచి మరొకళ్ళను చూపించి వాళ్ళల ఉండమని మీ పెద్దవాళ్ళు నేర్పించడం వాళ్ళ వచ్చిన జబ్బు ఇది. ఈ జబ్బు మరింత  పెద్దదై వినాశనానికి దారితేసేలోగా దాన్ని పోగొట్టుకోండి. ఇదే మీరు నేర్చుకోవలసిన రహస్యం.

                                                                                                           మౌనంతో రహస్యం

                                                                                   సద్గురు జగ్గీ వాసుదేవ్

Friday, June 28, 2013

బాధ్యత

ఏదైనా పని చేసినప్పుడు విజయం మనల్ని వరిస్తే అది మనవల్లే అని చెప్పడం, పరాజయం పాలైతే అందుకు నెపాన్ని మరొకరికి నెట్టడం మానవ నైజం. గెలుపులో ఓ మత్తు ఉంటుంది.. అది మన కళ్ళకి గంతలు కడుతుంది. ఫలితంగా మనం ఆ గెలుపు సాధించడానికి సాయపడ్డ వాళ్ళని తాత్కాలికంగానైనా మర్చిపోయేలా చేస్తుంది. అదే వైఫల్యం ఐతే మన ఇగో ని దెబ్బ తీస్తుంది. 'నా అంతటి వాడు ఓడిపోవడం ఏమిటి?' అనిపిస్తుంది. ఓటమికి కారణం మనం కాదు మరెవరో అనిపిస్తుంది.

చిన్నప్పుడు క్లాసులో మంచి మార్కులు వస్తే 'కష్టపడి చదివాను.. అందుకే మార్కులు వచ్చాయి' అంటాం. అదే మార్కులు సరిగ్గా రాకపోతే 'మేష్టారు సరిగ్గా పాఠం చెప్పలేదు' అనేస్తాం. అంతేనా? 'మేష్టారికి ఫలానా వాళ్ళంటే ఇష్టం..అందుకే నేనెంత చదివినా వాళ్ళకే మార్కులు వేస్తారు' అని ప్రచారం చేయడానికీ వెనుకాడం. ఇదే ప్రచారం ఎవరైనా మనమీద చేస్తే వాళ్ళని 'కుళ్ళుబోతు' అంటాం.

ఉద్యోగంలో మనం చాలా కష్టపడి పనిచేస్తాం.. (కనీసం మనం అలా అనుకుంటూ ఉంటాం) ప్రమోషన్ వస్తే అది మన ప్రతిభే.. మనకి కాకుండా పక్కవాడికి వస్తే వాడు బాసుని కాకా పట్టి తెచ్చుకున్నాడు.. ఈ రెండు వాదనలూ మన దగ్గర సిద్ధంగా ఉంటాయి. మనకి ప్రమోషన్ ఇచ్చిన బాస్ దేవుడు..ఆయనకి ప్రతిభని గుర్తించడం తెలుసు. అదే ప్రమోషన్ పక్కవాడికి ఇస్తే ఆ బాస్ ఓ పెద్ద ఫూల్.. మనం సరిగ్గా పని చేయకపోవడం అనే కారణం ఉండి ఉంటుందని మనకి తోచదు.

విజయానికి బాధ్యత వహించడానికి ఉత్సాహ పడే వ్యక్తులు మనకి అన్నిచోట్లా తారస పడతారు. ముఖ్యంగా సిని, రాజకీయ రంగాల్లో కొంచం ఎక్కువగా కనిపిస్తారు. సినిమా హిట్టయ్యిందంటే 'అది నా ప్రతిభే' అని హీరో, దర్శకుడూ విడివిడిగా ప్రకటనలిస్తారు. ఆ సినిమా కోసం వాళ్ళెంత కష్టపడ్డారో ఇంటర్వ్యూలు ఇస్తారు, అలుపు లేకుండా. తర్వాత వాళ్ళ మార్కెట్ పెరుగుతుంది. నిర్మాత కూడా సంపాదించింది ఖర్చయ్యే వరకూ సినిమాలు తీస్తూనే ఉంటాడు.

సినిమా ఫెయిలయితే మాత్రం హీరో, దర్శకుడూ కూడా వేలెత్తి చూపేది నిర్మాతనే. "నిర్మాత ఖర్చుకి వెనుకాడ్డంతో అనుకున్న క్వాలిటీ రాలేదు" అంటాడు దర్శకుడు. "నా ఇమేజ్ కి తగ్గట్టుగా సినిమా లేదు.. పబ్లిసిటీ కూడా సరిగ్గా లేదు.. నా అభిమానులు చాలా నిరాశ పడ్డారు" అంటాడు హీరో. నిర్మాతకి సొమ్ము పోవడంతో పాటు, పెద్ద హీరో, దర్శకులతో సినిమా తీసే చాన్సు కూడా శాశ్వతంగా పోయినా పోతుంది. ఒక్కోసారి దర్శకుడూ, పాపం హీరోయిన్నూ కూడా ఫ్లాపుకి బాధ్యత వహించాల్సి వస్తూ ఉంటుంది.

రాజకీయాల గురించి చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. గడిచిన ఐదేళ్లూ రాష్ట్రంలో చక్కగా వర్షాలు కురిశాయి. ప్రభుత్వం వరుణదేవుడికి అడక్కపోయినా తమ పార్టీ సభ్యత్వం ఇచ్చేసింది. (సభ్యత్వ రుసుము ఎవరు కట్టారో తెలీదు) సమయానికి వర్షాలు కురిపించినందుకు ఆయనకి కృతఙ్ఞతలు చెబుతూ పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చింది. (ఆయన కూడా పేపర్లు చదువుతాడని నాకు అప్పటివరకూ తెలీదు) వర్షాలు కురిసినందుకు పూర్తి బాధ్యత వహించింది.

ఇప్పుడేమో వర్షఋతువు సగం గడిచినా చినుకు రాలలేదు. వరుణ దేవుడు పార్టీ పదవి ఇవ్వలేదని అలిగాడో ఏమిటో తెలీదు కానీ చుక్క రాల్చలేదు. గడిచిన ఐదేళ్లూ వర్షాలు పడితేనే ధరలు ఇలా ఉన్నాయంటే, ఇప్పుడు వర్షాలు లేకపొతే భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో ఆలోచించడానికి ధైర్యం చాలడం లేదు. వర్షం కురవకపోడానికి ప్రభుత్వం బాధ్యత వహించడం లేదు. కనీసం వరుణ దేవుడిని నిలదీస్తూ ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. అసలు వర్షం విషయమే మర్చిపోయినట్టుంది.

విజయమైనా, వైఫల్యమైనా అందుకు పూర్తి బాధ్యత ఒక్కరిదే అవ్వదు. మనకి విజయం వచ్చినప్పుడు అందులో మరొకరి వాటాని అంగీకరించగల విశాలత్వం, వైఫల్యానికి బాధ్యత తీసుకోగల గుండె ధైర్యం, ఆత్మ విశ్వాసం అవసరం. ఇది రాత్రికి రాత్రి అలవడేది కాదు.. చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే కానిదీ ఏదీ లేదు. 

7th Chakra బ్రహ్మ శరీరం (Cosmic Body) : అజ్ఞా చక్రం నిర్వాణ శరీరం : సహస్రారం

ఇక్కడ కూడా ద్వంద్వ ప్రవృత్తి ఉండదు. అయిదవ మండలంలో అనుభవించిన ఆనంద స్తితి ఆత్మవ న్నత్యంగా మారితే ఆరవ శరీరం ఏర్పడినట్లు. ఇక్కడ ' నేను ' అన్నది ఉండదు. అస్మిత స్థితి సైతం లయించిపోతుంది. ' తత్వమసి ' అనేది అనుభూతికి అందుతుంది. అయితే అది అనుభూతి కాదు నిజానికి. తత్తుల్యమైన దివ్యాత్మానుభూతి. దివ్యానుభూతి ఇది అని చెప్పడానికి వీలులేనిది. సత్యాన్ని నేరుగా అందుకునే చైతన్యం అది. ' నేను ' ఆత్మగా మారి, ఆ రెండూ కానిదేదో అయిపోయి, బ్రహ్మ్మంలో లీనం కావడం వంటిది.
' అహం బ్రహ్మ్మస్మి ' అనే పర జ్ఞానం కలిగిన తరువాత అహం లయిస్తుంది. ' నేను ' అనే అస్తిత్వ స్పృహ పోతుంది. అంతా బ్రహ్మ్మమయం అనే భావన మిగులుతుంది. బ్రహ్మ్మంలో అహం సైతం కలిసి, కరిగిపోయి బ్రహ్మ్మం మాత్రమే మిగులుతుంది. అదే బ్రహ్మ్మత్వ సిద్ధి. అదే బ్రహ్మ్మీస్థితి.
ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు! 'అహం బ్రహ్మ్మస్మి ' - నేను బ్రహ్మ్మాన్ని సరే. ' నేను ' లేకుండా బ్రహ్మ్మం మాత్రమే మిగిలినప్పుడు ' అహం ' ఏమైనట్లు? నేను ఏమైనట్లు? ఈ సాధన, యోగం, తపస్సు అంతా అలా లయించడానికా? బ్రహ్మ్మంలో లయించి ఏమీ కాకుండా, ఏమీ మిగలకుండా పోతే ఏమీ సాధించినట్లు? ఏమి ప్రయోజనం? మనం ఏ గమ్యం చేరుకున్నట్లు?
గమ్యం మనకి కాక, ఆత్మకి కాక, మరెవరికి? అగమ్యమే గమ్యమా? బ్రహ్మ్మం అంటే పూర్ణం అని అంటారు. బ్రహ్మ్మమే సత్యం. బ్రహ్మ్మమే సృష్టికి మూలం, ఆధారం, సృష్టి రహస్యం. అయితే సృష్టి రహస్యాన్ని చేదించినట్లు అవుతుందా! ఏం సాధించినట్లు?
ఈ సందేహాలతో సాధన అక్కడ ఆగిపోతుంది. 12,000 జన్మలెత్తినా, మళ్ళీ మళ్లీ మొదటికి వచ్చినట్లు అక్కడ ఆగిపోవడం జరుగుతుంది ఆపైన తెలుసుకునేది ఏమి లేక. బ్రహ్మ్మాన్ని తెలుసుకున్న యోగి బ్రహ్మ జ్ఞాని అవుతాడు. తానే బ్రహ్మ్మం అయినప్పుడు, బ్రహ్మ్మమే తానని తెలుసుకోవడంతో అన్వేషణ పూర్తి అయినట్లే గదా! ఇంక గమ్యం ఏమిటి? అది అంతం లేని బ్రహ్మ్మమే తానైనప్పుడు తానే అనంతుడు, సర్వ సాక్షి అవుతాడు.
ఈ బ్రహ్మ్మాన్ని సైతం అధిగమించి పైకి పోతే నిర్వాణ శరీరం. అది కనిపించేది కాదు. కానీ అది అదే. ఏమీ కిగాలకపోవడమే నిర్వాణ స్థితి. దీనికి కేంద్రం సహస్రారం. దీనిని చక్రంగా వర్ణించడం జరగని పని. ఆరవదైన ఆజ్ఞా చక్రం వరకే మన ప్రజ్ఞ పనికొస్తుంది, పనిచేస్తుంది. ఎన్ని అనుభవాలు పొందినా, అనుభూతులకు లోనైనా సాధకుడు యోగంలో లయిన్చినప్పుడు సహస్రారం పై నిలుస్తాడు. అక్కడ చేసే ధ్యానం, ధారణా ఏమీ ఉండవు. అది సాధకుని cosmos తో సంధానపరుస్తుంది. ఇహానికి, పరానికి వారధి కేంద్ర బిందువు. దానిని మూడవ నేత్రంతో దర్శించవచ్చు. మూడవ కంటితో చూడగలిగితే మనం త్రినేత్రులం అవుతాం. అది ఈశ్వరీయత.
In general about our inner bodies and chakras:
మొత్తం ఆరు చక్రాలు, ఏడు శరీరాలు, వీటిలో కలిగే అవరోధాలు కానీ, అనుకూలాలు గాని ఏవీ బయట ప్రపంచానికి సంభంధించినవి కావు. అన్నీ లోపల్లోపల జరిగే మార్పులు. శోధన మనది, పరిశోధనా మనదే. మనం లోగడ తెలుసుకున్నవి, విన్నవి మన శోధనకు ఉపకరిస్తాయి. అనుభవంతో కన్నది మాత్రమే పరిశోధన. బయట నుండి ఆర్జించిన విజ్ఞానం మొత్తం తిరిగి బయటకే వెళ్లి పోతుంది. లోపల దానికి స్టానం ఉండదు. ఏదైనా తెలుసుకోవచ్చు. తెలుసుకోవడం వరకే అది పరిమితం. అంతటితో తృప్తి పడి, చతికిల పడితే ఏమీ లాభం లేదు. ఈ తర్వాత అంతశోధన, ఉపక్రమించాలి. అందుకు సాధన అవసరం. ధ్యానం ఆలంబనం. అంట స్సోధన, సాధన మాత్రమే మనల్ని అంతర్ జగత్తుకు పరిచయం చేయగలవు. అలా లోపలకు వెళ్ళిన కొద్దీ ఒక్కొక్క చక్రం అనుభూతికి అందుతుంది. అనుభవాలు కలిగిస్తుంది. మంచి, చెడులు రెండూ మనవే. మనమ్గానే అనుభవించాలి. అనుభూతుల్ని మాత్రం మనలో మిగుల్చుకొని భద్రపరుచుకోవాలి. ప్రకృతి సహజంగానే ప్రతి మనిషికి కొంత శక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, ఉన్నా శక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మ శక్తిని పెంపొందిన్చుకోగాలగాలి. ఉత్తినే చేతులు ముడుచుకు కూర్చుంటేఏ దేవుడు దయతలచాడు, కరుణించాడు, వరాలివ్వాడు. కనీసం ఒక మహ్హత్ముని అనుగ్రహానికి పాత్రులం కావాలన్నా మన అర్హతను నిరూపించుకోవాలి. అపాత్రదానం ఎవరూ చెయ్యరు, చేయకూడదు.
ప్రాచీన యోగ సాహిత్యం అయిదవ చక్రం వరకే చెప్పగలిగింది -
ఆ తరువాతనే అసలు ' సత్యం ' తెలుస్తుంది. అందుకే సత్యాన్ని ఎవరికీ వారు తెలుసుకోవాలని చెప్పేది.
అయుదారు శరీరాల వరకు వెళ్ళ గలిగితే యోగి.
నాలవ శరీరం వరకు సాధకుడు.
ఆ తర్వాత మెట్టు నుండి ప్రతి సాధకుడు యోగి అవుతాడు. పుణ్య లోకాలు చేరుకుంటాడు.
దివ్యలోకాల్ని స్వర్గం అనవచ్చునేమో. దేవుడు, దేవత రెండూ ఒక్కటే అనుకుందాం. కామరూపుడై ఉంటాడు కనుక, కోరిక తీరే వరకు ఆ స్వర్గంలో ఉంటాడు. అక్కడ మృత్యువు ఉండదు కనుక ఇష్టమైనప్పుడు తిరిగి మానవ జన్మకు రావడమే.
ప్రతి దేవుడు, దేవత నిర్వాణ స్థితికి చేరాలంటే తిరిగి మానవ జన్మకు వచ్చి, భొతిక శరీరం ధరించి యోగం చేయవలసి వుంటుంది.
అయిదవ శరీరం పొందిన యోగి భౌతిక శరీరంలోకి రానవసరం లేదు.

ఆరవ చక్రం వరకు వెళ్ళినవారు, ఆత్మ శరీరం పొందిన యోగులు దేవతా రూపాల్ని ఆశించరు. స్వర్గాన్ని నివాసం చేసుకోరు. వారికి ఎలాంటి శరీరాలు అవసరం లేదు. 

ఆత్మ శరీరం : విసుద్ది చక్రం 5th Body : 5th Chakra

Friends, spirituality లో ఇక్కడ ఇచ్చిన information very very important. ఎందుకంటే మన పురాణాలూ ఇక్కడ వరకే వ్రాసి పెట్టాయి. ఈ లెవెల్లో లక్షల మంది మోక్షం ఇదే అని అనుకుని ఆగిపోయారు. ఇది త్రిశంకుస్వర్గం లాంటిది. ఈ information మీకు lifelong use అవుతుంది.
ఈ చక్రానికి కేంద్రం కంట్టస్టానం. మొదటి నాలుగు శరీరాలు ద్వంద్వ ప్రవ్రుత్తి కలవి. ఈ అయిదవ శరీరం ద్వంద్వాతీతం. నాల్గవ శరీరం వరకే స్త్రీ, పురుష బేధం కనిపిస్తుంది. ఆత్మ శరీరానికి స్త్రీ, పురుష బేధం ఉండదు. మనుషులలో తేడాలు స్త్రీ, పురుష బేదాల వల్ల ఏర్పడినవే.
ఇక్కడ నుండి యోగ సాధనలో శ్రమ ఉండదు. బేధాభావం లేనప్పుడు అభివృద్దికి ఆటంకాలు ఏర్పడే ప్రసక్తి లేదు. ఎలాంటి అవరోధాలు ఉండవు. అసలు నాల్గవ శరీరం ఏర్పడడంతోటే సాధకుని స్థితి మారిపోతుంది. అన్నిటికీ అతీతంగా ఉందా గలుగుతాడు. అలా ప్రవర్తించ గలడు. తన గమ్యం ఈ లోకం కాదన్నట్లు, తన పయనం ఆత్మలోకి అన్నట్లు ఉంటాడు.
నాల్గవ శరీరం సాధించి, అందులో పూర్ణత్వం పొందిన సాధకుడు సులభంగా అయిదవధైన ఆత్మ శరీరం పొందగలడు. అయిదవ శరీరం అంతా చైతన్యమే. అంతా జాగ్రితి. రాత్రి వేళల్లో సైతం యోగి చైతన్యంలో మేల్కొనే ఉంటాడు. నిద్ర ఉండదు. అలసట ఉండదు. విశ్రాంతి అవసరం కనిపించదు. శరీరం, మనస్సు ఏదీ అలసిపోదు. 24 గంటలూ పనిచేసినా అలసట ఉందదు. మనస్సు సదా మేల్కునే ఉంటుంది. కనుక ఎలాంటి ఆలోచనలు కలవరం పెట్టావు. కలల్ని కలిగించవు, శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా మనస్సు మేలుకొని ఉంటుంది. అంటే లోపలి సూక్ష్మ శరీరాలు సదా మేల్కొనే వుంటాయి. భౌతిక శరీరం వాటి కార్యక్రమాలకు ప్రతిబంధం కాదు. శరీరం నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది కానీ, చీమ చిటుక్కుమన్నా మెలుకువ వస్తుంది. అది నిత్య జాగ్రదవస్థ. అంటే ఏమిటి? మనస్సు అలుపు, సొలుపు, విశ్రాంతి లేకుండా సదా అప్రమత్తంగా ఉంటుంది. నిద్రలో సైతం చైతన్యం తరగదు.
ఆత్మ శరీరానికి ' నిద్ర ' ప్రధాన ద్వారం. గత శరీరాలలో నిద్రతో జోగి , తూగే వ్యక్తి అయిదవ శరీరం ఏర్పడగానే శాస్వతంగా నిద్రకు దూరమవుతాడు. అంటే చైతన్య స్పూర్తితో చైతన్య మూర్తి అవుతాడు.
నాల్గవ శరీరం ఏర్పడిన ప్రతి సాధకుడు బుద్ధుడే. ఆత్మ చైతన్యం పొందడమే భోదిసత్వ సిద్ధి. నాల్గవ శరీరం వరకు మన పెత్తనం కనిపించదు. ఏదో జరుగుతున్నట్లు, ఆ జరిగే సంఘటనలు దైవికమని, మానుష ప్రయత్నం వల్ల జరగడంలేదని, మనం నిమిత్త మాత్రులం అని అనిపిస్తుంది.
అయిదవ శరీరం ఏర్పడగానే కర్త్రత్వం మనది అవుతుంది. అప్పుడు గడిచిన నాలుగు శరీరాల పైన, దాటి వచ్చిన నాలుగు చక్రాలపైన ఆధిపత్యం మనకే వస్తుంది. అంతవరకు నిమిత్త మాత్రులంగా వున్నా ఇప్పుడు స్వఇచ్చతో, స్వసంకల్పం తో ఆ పనులన్నీ నిర్వహించగల ప్రజ్ఞ ఏర్పడుతుంది. " ఇది నేను చేస్తాను, చేస్తున్నాను " అని చెప్పకుండానే అన్నీ చేస్తాం. అపజయం ఉందదు. ఆత్మ శరీరికి అహంకారం ఉండదు - అపజయం ఉండదు.
మామూలు మనిషి నిద్రకు, చైతన్య వంతుడైన వ్యక్తి నిద్రకు చాలా తేడా ఉంటుంది. మామూలు మనిషికి నిద్రలో తన గురించి ఏమీ తెలియదు. తన శరీరాన్ని మనస్సును మరిచిపోతాడు. చైతన్యం గల వ్యక్తి సదా జాగృతిలో ఉంటాడు గనుక, శరీర స్పృహ, మానసిక అనుభూతి ఉంటుంది.
" నేనెవరు? " అనే ప్రశ్నకు అయిదవ శరీరంలో గాని సమాధానం దొరకదు. ఆత్మ మేల్కొన్నపుడు మాత్రమే 'నేను' అనేది ఏమిటో ఎరకవుతుంది. ' నేను ' అనేది ఆత్మ. అది ఆత్మ గతం. ఆత్మ శరీరంలో పూర్తిగా లయించి, నసించిపోతుంది. వ్యక్తిత్వం పూర్తిగా పోతుంది. ఈ శరీరం మనస్సు నావి కావు, నేను 'నేను' కాదు ఇతరం అన్న స్పృహ, జ్ఞానం కలుగుతుంది. అక్కడ ఏ ద్వంద్వాలు , బంధాలు, బాధలు, వికారాలు ఉండవు. ఆత్మకు, ఆత్మ శరీరానికి అది ఆనంద నిలయం. అక్కడ శరీరాన్ని త్యజించాలని అనిపిస్తుంది. శరీరంతో అవసరం కనిపించదు. చాలా మంది యోగులు, మహర్షులు ఆ స్థితి లోనే, ఆత్మ శరీరం పొందిన తర్వాత భౌతిక శరీరం అనవసరం అనిపించి, శరీరం విడిచిపెడతారు. ఐచ్చికంగా శరీర త్యాగం చేస్తారు. కొందరు సజీవ సమమది అయి, ఆత్మ శరీర్లుగా ఉంటారు. అది యోగికి ఆఖరి మజిలి కాకపోయినా, భౌతిక శరీరం అనవసరమని గ్రహిస్తారు. దానిని త్యజిస్తారు.
అది ఆనందస్థితి అనుకుందాం. ఆనందాన్ని ఎంత అనుభవించినా తనివి తీరదు. తృప్తి కలగదు. సచ్చిదానంద స్థితి లో తన్మయుడై శరీరాన్ని, శరీర సుఖాలను అలక్ష్యం చేయడం, విస్మరించడం జరుగుతుంది. తర్వాత తాను సాధించ వలసిందేమి లేదనిపిస్తుంది. కనుక అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఏ మాత్రం తృప్తి పడినా తర్వాత ప్రయాణం సాగదు. ఆనందం పతాక స్థితికి చేరుతుంది. సచ్చిదానందంతో ఆగిపోకుండా, ఆత్మను వేరు చేస్తే, ఆత్మ స్పృహతో మున్ముందుకు సాగడం సాధ్యం.
నైరాస్యంతో ఉన్నవారు, కష్టాలలో ఉన్నవారు భగవంతుని వైపు దృష్టి మళ్ళిస్తారు. లేదా తమను కష్టాలనుండి కాపాడగల మహాత్ముడు ఎవరా అని వెదుకుతుంటారు. అన్నీ బాగున్నప్పుడు ఎవరూ భగవంతుని స్మరించరు. మహాత్ములని వేదకరు. అలాగే సచ్చిదానంద స్థితిని చేరిన సాధకుడు ఆ ఆనంద పారవశ్యంలో తన తుడుపరి గమ్యాన్ని మరిచిపోతాడు. ఇక్కడ సచ్చిదానందం కూడా ఒక అవరోధమే అవుతుంది. ఆత్మ జ్ఞానం కలగగానే సాధన కొంచెం మందగిస్తుంది. చాలా మంది ఆ తర్వాతిదైన బ్రహ్మ జ్ఞానం గురించి మరిచిపోతారు.
బ్రహ్మ్మాన్ని అనుభూతించడం అంటే సృష్టి కేంద్రానికి చేరడమే. ఆనందంతో దాన్ని మరిచిపోతే ఎలా? సచ్చిదానందం కూడా ఒక విధమైన అనుభవంగా గుర్తించాలి. అప్పుడు విస్మృతి ఉండదు. ఆత్మ స్పృహ పోదు. అక్కడ అలా జరగడానికి ఒక కారణం ఉంది. అక్కడ మనస్సు ప్రమేయం ఉండదు. అప్పటికే మనస్సును దాటి చాలా దూరం వచ్చేస్తాం. మనస్సు భూమిక కానప్పుడు ఏదీ అనుభవంగా మిగలదు. అనుభూతి అవుతుంది. అనుభవాన్ని మాటలతో చెప్పగలం గాని, అనుభూతిని వ్యక్తం చేయలేం. అది అవ్యక్తానందానుభూతి. అయిదవ శరీర అనుభవాలు అవ్యక్తాలు. అక్కడ ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అవ్యక్తానందం తనదవుతుంది. ఆ దివ్యస్పూర్తితో చెప్పేది ప్రామాణికం అవుతుంది. కానీ సత్యసమ్మతం కాదు. సత్యం ఇంకొంచెం పైమెట్టు పైనగాని అందదు. సత్యం కోరేవారు, సత్య దర్శనం కావాలనుకొనేవారు ఇంకా పైకి పయనించాలి.
మన తపస్సు, అన్వేషణ సత్యం కోసం అయితే అయిదవ శరీరంతో ఆగిపోము. కనుక యోగారంభంలోనే మన గమ్యాన్ని నిర్దేశించుకోవాలి.
ఒక ఆనంద స్థితికి చేరుకోవదమో, స్వర్గాన్ని పొందడమో, సచ్చిదానంధమో లక్ష్యం అనుకుని యోగం ప్రారంబిస్తే, అక్కడి దాకా వెళ్లి ఆగిపోతాం.
సత్యాన్ని గమ్యం చేసుకుని ప్రస్థానం సాగిస్తే కడవరకు, సృష్టి మూలం వరకు వెళ్ళవచ్చు.
ఎందుకంటే అయిదవ చక్రం వరకు ఆరోహణ సజావుగా సాగినట్లే అనిపిస్తుంది. కానీ అక్కడ సడన్గా ఆగిపోవడం, ముందు దారి కనిపించకపోవడం జరుగుతుంది.
మన లక్ష్యం సత్యం అయితే అక్కడ ఆగిపోము. అంటే ఆత్మ శరీరంతో తృప్తిపడం. అత్యద్బుతం, అపూర్వం అయిన అనుభవం సాధకుని చాలా ఎత్తులకు చేర్చడం వలన, ఇంకా ఆపైన ఏమీ లేదని అనిపిస్తుంది. అదే అవరోధం.
ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం అనుభవించిన కస్టాలు, బాధలు, బందిఖానాలు, బంధాలు అన్నీ వదిలించుకుని ఆత్మ సర్వస్వతంత్ర మవుతుంది. ఈ ప్రపంచపు కల్లోలాల నుండి ఒక్కసారిగా ఆనంద సీమల్లోకి వచ్చి పడగానే మనల్ని మనం మరిచిపోతాం. గమ్యాన్ని సైతం మరిచిపోతాం. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతాం. అక్కడే శాస్వతంగా ఉండిపోవాలనిపిస్తుంది. అంటే ఆత్మ సైతం ఒక ప్రలోభానికి లోనవుతుంది. అక్కడ లయించిపోతున్నామని తెలుస్తుంది. అయినా ప్రతిఘటించలేము. ఆ మహా శక్తి ముందు మన ప్రయత్నం, శక్తి అక్కరకు రాదు. అందుకే అయిదవ శరీరం లయ. అది యోగంలో లయించడం, చైతన్యంలో లయించడము అదే.
' అహం ' నశించినా ' అత్మస్ప్రుహ ' మిగిలే ఉంటుంది. ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది లీలగా. అలా అనిపించడమే ' అస్మితం '. ఇక్కడ గుర్తించే పని మనది కాదు 'ఆత్మ'ది. మన ఆత్మ వంటి ఆత్మలు వందలు, వేలు, లక్షలు తిరుగుతుంటాయి. 'మయాహాత్మాసర్వభూతాత్మా ' అన్నట్లు ఇది భూతరహితమైన ఆత్మ సంచారం. ఆత్మ తత్త్వం అవగాహనకు అందదు. అది అనంతం. అక్కడ కనుక కించిత్ అస్తిత్వ స్పృహ వుంటే ఆత్మ తత్వంతో ఆనంద సాగరాన్ని దాటి ఆవలి తీరానికి చేరుకోవచ్చు. ఎల్లకాలం సచ్చిదానంద స్థితిలో మనుగడ సాధించాలన్నా దుర్భరమే.
అయిదవ శరీరాన్ని, భూమికను దాటి ఆరవ శరీరం పొందడం చాలా చాలా కష్టం. ఎవరో మహర్షులకు, మహాయోగులకు మాత్రమే సాద్యం అవుతుంది. అనేక జన్మల యోగ సాధన, తపస్సు అందుకు అవసరం.
ప్రతి జన్మలో తపస్సు చేస్తున్నా, చాలా చాలా సత్కార్యాలు చేసినా అయిదవ శరీరానికి వచ్చే సరికి, లక్ష్యాన్ని విస్మరించడం, సచ్చిదానందంలో తలమునకలై పోవడం జరుగుతుంది. అందుకే మళ్లీ జన్మకు వెళ్ళడం, కారణజన్ము లనిపించు కోవడం జరుగుతుంది. కారణజన్ములైనవారంతా సాక్షాత్తు భగవదంశ సంభవులే, పరామాత్మ స్వరుపులే.

మొదటి నాలుగు భూమికలు సులభం యోగికి. అయిదవ దాన్ని దాటడమే దుస్తరం. మొదటి నాలుగింటిలో మనవ సహజమైన ప్రతిభలు, ద్వేషాలు, అసూయలు, వాంచలు, అహంకారం వదులుకోగలరు. అయిదవ మండలంలో ఆత్మను సైతం వదలవలసి వస్తుంది. బాహ్య ప్రపంచాన్ని త్యజించినంత సులభం కాదు ఆత్మను వదలడం.

అసతోమా సద్గమయ - తమసోమా జ్యోతిర్గమయ

జీవితంలో ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఆధారం చేసుకుని గమ్యం వైపు పయనించాలి! మెల్లగా నత్త నడక నడుస్తావో, పంచకళ్యాణి లాగా పరుగు తీస్తావో నీ యిష్టం. నీ శక్తి - కాని లక్ష్యం చెడకూడదు. గమ్యం కనుమరుగు కాకూడదు. కొందరికి వెంటనే అవకాసం వస్తుంది, మరి కొందరికి జీవితంలో ఎప్పుడో వస్తుంది. అంతవరకు నిరీక్షించక తప్పదు.
వేదాంతులు, సన్యాసులు, ఈ ప్రపంచం అశాస్వతమని చెబుతారు. కనిపించే ప్రపంచం మిధ్య అంటారు. ఈ వాదాన్ని ప్రతివారు నమ్మినట్లే నటిస్తారు కానీ నమ్మరు. అశాశ్వతమైన ఈ ప్రపంచంలోనే బ్రతుకుతూ, అశాశ్వతమైన సుఖభోగాలకు, డబ్బుకు దాసోహం అంటారు. నిజమేనా?
కాదు, ప్రపంచం ఉంటుంది, ప్రపంచాన్ని అంటి పెట్టుకున్న విలువలు ఉంటాయి. మనుషులు మారిపోతుంటారు. అలా జీవించి ఉండకపోవడం ‘అసత్’ అనుకుందాం. దీనిలో నుండి సత్యమైన దానిని, నిత్యమైన దానిని పొందడం ‘సత్’గమం అవుతుంది. ప్రపంచ మిధ్య కాదు. మనం transmit అవడం ముఖ్యం. కాదంటారా? మీరూ ఆలోచించండి!
చదువుకుని ఆలోచించగలవారు కూడా స్వంతంగా, స్వతంత్రంగా ఆలోచించడం లేదు. ఇతరుల ఆలోచనల్ని కాపీ కొట్టి తమ స్వంతం అనుకుంటారు. ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మడం మేధావి లక్షణం కాదు. నా భావంలో సత్ అంటే – existence. అంటే అస్తిత్వం . అస్తిత్వం ప్రక్కన స్థిరత్వం అనే మరొక పదం చేర్చండి. ఇప్పుడు చెప్పండి అస్తిత్వం అంటే ఏమిటి? ఎలా ఏర్పడింది. అయితే existence కు ముందర ఉన్న స్థితి ఏమై ఉంటింది.
Existence కి ముందర ఏమీ లేనట్లే కదా!
అవును కదూ. Non-existence అంటే nothingness అంటే శూన్యత అనేది Origin అన్న మాట. Emptiness అంటే nothingness అవుతుంది. అంటే ‘అసత్’ అన్న మాట. Non existence నుండి existence పుట్టుకొచ్చింది. అది “అసతోమా సత్ గమయ”.
మరొక విధంగా చెప్పాలంటే అస్థిరంగా ఉన్న మనస్సు స్థిరం కావడం. అంటే అస్తిత్వం ఆఖరు కాదు. పరిమాణం ఉంది మద్యలో. అస్తిత్వం అద్యాత్మికంగా పరిణమించాలి. మనస్సు ఆత్మ వేపు పరిక్రమించాలి. అందుకు మనం పరిస్రమించాలి. అదే యోగం. అదే సాధన. అస్తిత్వంతో పరిణామం ఆగదు. జీవుని ప్రయాణం ఆగదు. అశాశ్వతమైన దాని నుండి శాశ్వతమైన దాన్ని అందుకోవాలి. అదీ అసత్ నుండి సత్ కు పరిణామం. అంటే జీవుని యాత్ర అశాశ్వతం నుండి శాశ్వతత్త్వంలోకి. అదీ అసలైన జీవయాత్ర..
మనిషి జీవయాత్ర - జీవనయాత్ర కాదు.
అది మేధ వల్ల జరగదు. ఆత్మ సహకారంతో జరుగుతుంది. జరగవలసింది ఆత్మ పరిణామం. ఇంతవరకు సృష్టి పరిణామం, జీవ పరిణామం గురించి మీరు విని ఉంటారు. నేను చెప్పేది ఆత్మ పరిణామం గురించి, అదే నేను చేసే యోగం. ఇది ఆత్మ యోగం. ఆత్మ జాగృతి కోసం చేసే సాధన.
ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది. కానీ అందరిలోనూ అది జాగృతం కాదు. బహిర్గం కాదు. చైతన్యం పొందదు. బహుకొద్ది మందిలో ఆత్మ జాగృతి కలుగుతుంది. అందరిలోనూ ఎందుకు కలగడం లేదంటే ఆ దిశగా పయనించక, ప్రయత్నించక పోవడమే కారణం. మనస్సు చీకటి గదుల్లో ఆత్మ నిద్రిస్తూ ఉంటుంది. దానిని నిద్ర లేపి జాగృతం చేయాలి. మనవారు కుండలినీ శక్తిని లేపడానికి యత్నిస్తారు. నిజానికి నిద్రలేపవలసింది, చీకటి నుండి వెలుగులోకి తీసుకురావలసింది ఆత్మను. అది “తమసోమా జ్యోతిర్గమయ” అంటే అర్ధం. కస్టపడి, నానా అవస్థలు పది కుండలినీ శక్తిని లేపినా అది కడకు చేసే పని ఆత్మను తట్టి నిద్ర లేపడమే. ఆ పనేదో మనస్సుతో మనమే చేసుకోవచ్చు.

ఆత్మ ఆచూకీ తెలిస్తే కదా దానిని జాగృత పరచడం అంటారు. ముందు మనస్సును సన్మార్గంలో పయనింప చేస్తే ఆ సంస్కారం ఆత్మ జాగృతికి ఉపకరిస్తుంది. మనస్సు వెలుగు ముద్దగా మారితే, ‘ఆత్మ’ ఉండేందుకు తమస్సు లేక, నిద్రలేస్తుంది. జాగ్రుతమవుతుంది. అలా direct గా ఆత్మ వ్యవహారం పట్టించుకోవచ్చునని నా సిద్ధాంతం.

ఆసనాలు వేయడమే యోగమా ?

ఆసనాలు వేయడమే యోగం అనే ప్రచారం వుంది.
హట యోగంలో ఆసనాలకు ప్రాముఖ్యత ఎక్కువ. వాటికి తోడు ప్రాణాయామం చేర్చి ముద్రలు, బంధాలు కలిసి ఆ మొత్తాన్ని యోగంగా చెలామణి చేస్తున్నారు. పెద్ద పెద్ద ఆశ్రమాలలోను అదే తంతు.
అసలైన ధ్యానం, తపస్సు కొద్ది మంది మాత్రమే చేస్తుంటారు.
అష్టాంగ యోగం అని కొన్ని సూత్రాలు పట్టుకుంటారు. చివరకు ఫలితం వున్నా లేకపోయినా వాటికి అలవాటుపడి, అదే యోగం అనే అభిప్రాయానికి వస్తారు.
ధ్యానమే యోగం.
ధ్యానం ఒక్కటే యోగం.
తపస్సు ధ్యానానికి అవతలి తీరం. ధ్యానం చేస్తున్నప్పుడు కుండలినీ చైతన్యం కలుగుతుంది. అలా కలిగినప్పుడు శరీరంలో అనేక స్పందనలు, చలనాలు ఏర్పడతాయి. అప్రయత్నంగా ముద్రలు, స్పందనలు కలుగుతాయి. అవి సహజంగా, అసంకల్పితంగా ఏర్పడితే కుండలినీ చైతన్యం కలిగినట్లు. అలా కుండలినీ చైతన్యం కలగటం యోగక్రియ. అందరికీ అలా ఏర్పడదు.
కుండలినీ చైతన్యం పొందేటట్లు ధ్యానం చేయడం ఎలా?
ధ్యానం చేయనిదే కుండలినీ మేల్కొనదు. కుండలినీ మేల్కుంటే తప్ప యోగక్రియ ప్రారంభం కాదు. ఆసనాలు, ముద్రలు, స్పందనలు లాంటివి ఏవీ రావు. ఇక్కడ మనం శాస్త్రీయంగా పరిశీలన జరపడానికి వీలుంది.
ప్రతి మనిషికి మనస్సును బట్టి ప్రవర్తన మారుతుంది. మనః స్థితిని బట్టి ముద్రలు, భంగిమలు మారుతుంటాయి. ప్రతి క్షణం దీన్ని మనం గమనించవచ్చు. నిద్రపోయేటప్పుడు పడుకున్న తీరును బట్టి మనస్సును తెలుసుకోవచ్చు. అంటే ఏమిటి?
మన శరీరంలో ముద్రలు ఏర్పడడానికి మనఃస్థితి కారణం. ముందు మనస్సు, తర్వాత శరీరం. పతంజలి కూడా మనస్సును అదుపు చేయడమే యోగం అన్నాడు. మనస్సు నిశ్చలమైతే శరీరం నిశ్చలమవుతుంది. అంటే పైన కనిపించే ముద్రలు, ఆసనాలు, స్పందనలు, చలనాలు ఏవైనా మనస్సుకు ప్రతిబింబాలు, ప్రతిక్రియలు. కుండలినీ క్రియలకు ఇవి ప్రతిక్రియలు. కుండలినీ చైతన్యం కలగకపోతే ఇవేవి సహజంగా ఏర్పడే అవకాశం లేదు. ఆ తర్వాత మనస్సు నిశ్చలం కావడం, కుండలినీ శక్తి పైకి ప్రసరించడం సున్నితంగా జేరిగే పని. అంటే ఏమిటి? ధ్యాన క్రియలో మనం ముందుగా కుండలినిని జాగృత పరచాలి. దానికి చైతన్యం కలిగించాలి. ఆ పైన సహజంగా ముద్రలు, ఆసనాలు ఏర్పడతాయి. ప్రాణాయామ క్రియ కూడా అందులో ఒక భాగమే. వెన్నెముక్క ముందుకు, వెనక్కు వాగడం వల్ల కుండలినీ శక్తి పైకి ప్రవాహం పైకి పోతున్నట్లు. ఒక రబ్బరు tube లో నీరు వేగంగా పోతున్నప్పుడు tube అటు ఇటు ఊగుతుంది. గుండ్రంగా తిరుగుతుంది. ఒక్కొక్కసారి నేలకు తాకుతుంది. ఎన్నడూ తనకు అలవాటు లేని ముద్రలు, ఆసనాలు సాధకుడు అప్రయత్నంగా వేయడమూ జరుగుతుంది. మనం నిద్రపోయేటప్పుడు మన ప్రయత్నం లేకుండానే ఎన్నో ముద్రలు వేస్తాం గమనిచండి. అది యోగా క్రియకు చిహ్నం.
శక్తి మేల్కున్నప్పుడు ఏర్పడే చలనాలు, స్పందనలు, ఆసనాలు, ముద్రలు, చివరకు శ్వాస క్రియ అన్నీ యోగాభివ్రుద్ధికి నిదర్శనాలు. అవి అప్రయత్నంగా ధ్యాన స్థితిలో కలగాలి తప్ప, వాటిని కస్టపడి నేర్చుకుని, గడియారం దగ్గర పెట్టుకుని రెండేసి నిమిషాలు సాధన చేసి, పదేసి ప్రాణాయామ క్రియల్ని చేసి ‘యోగం’ అంటే కుదరదు. అది యోగం కాదు.
యోగం చేస్తున్నవారిలో కొందరికి పారవశ్యంలో అలాంటి స్పందనలు, చలనాలు, ముద్రలు వచ్చినప్పుడు వారి ఆరోగ్యం చక్కబడడం, ఉత్సాహం పొందడం జరుగుతుంది. యోగా క్రియ శరీరంలోని లోపాలను చక్కదిద్దుతుంది. మనస్సును ప్రశాంత పరుస్తుంది సహజంగానే.
అలా సహజ యోగక్రియలు పొందలేని వారు పొందిన వారిని చూచి అనుకరిస్తూ, అలా తామూ ఆసనాలు, ముద్రలు పట్టి యోగం చేసామని త్రుప్తి పడుతుంటారు. సహజంగా చెట్టు పెరిగి, పుష్పించి కాయలు కాసినప్పుడు వున్న అందం ఏవో పూలు కాయలు తెచ్చి ఒక చెట్టును తయారు చేస్తే వస్తుందా? అది కృత్రిమం. అది అసహజం. యోగ ముద్రలు సహజంగా ఏర్పడినప్పుడు మంచి ఫలితం ఉంటుంది.
మన శరీరానికి అవసరంలేని ఆసనాలు practice చేయడం వల్ల ఉన్న ఆరోగ్యం చెడిపోయే అవకాశం వుంది. కనుక ఆసనాలు వల్ల ఆరోగ్యం బాగుపడనూ వచ్చు... కొంతవరకు చేడిపోనూ వచ్చు. సాధకునికి అవసరం లేని క్రియల వల్ల నష్టమే గాని లాభం ఉండదు.
సాధకుడు ధ్యానస్థితిలో తన్మయావస్తలో పొందిన ముద్రలు, ఆసనాలు, శ్వాస క్రియలు ఏవైనా గొప్ప అనుభూతి నిస్తాయి.వేల సంవత్సరాలుగా జనం ఆసనాలు గట్రా వేస్తూనే ఉన్నారు. ప్రాతః సమయాన ప్రాణాయామం చేస్తూనే ఉన్నారు. యోగం మాత్రం చేయడం లేదు. అవి మాత్రమే యోగం కాదు. వాటి ద్వారా యోగక్రియ పొందడం సాధ్యం కాదు. ధ్యానం ద్వారా యోగం పొంధవలసిందే. లోపల ఏ మాత్రం స్పందన కలిగినా యోగ క్రియ ఆరంభమైనట్లు. స్పందన కారణంగా ఏర్పడే యోగక్రియల్ని నిరోధించకూడదు.
యోగం ఏ ఆసనంలో వేయాలి? కూర్చిని పద్మాసనం వేసి చేయాలా! సుఖాసనం సరిపోతుందా! శవాసనం మంచిదేనా?
అనేక అనుమానాలు ఆరంభంలో. పద్మాసనంలో, యోగశనంలో కూర్చున్నత మాత్రాన యోగా స్థితి కలగదు. శరీరంలో ఎలాంటి వత్తిడి లేకుండా free గా కూర్చోవాలి. మనస్సును స్థిమిత పరచడం ముఖ్యం.
కుండలినీ స్పందన కలిగిన మరుక్షణంలో వెన్ను నిటారుగా నిలుస్తుంది. వంగి కూర్చున్న వ్యక్తి కూడా తిన్నగా కూర్చుంటాడు. శరీరం ఒక చక్కని ముద్రలోకి వెడుతుంది. మానసికంగా సిద్దమైనప్పుడు స్పందన కలుగుతుంది. స్పందన వెంట చైతన్యం ఏర్పడుతుంది. చైతన్యంతో యోగక్రియ ప్రారంభమవుతుంది. యోగక్రియతో ఈ ఆసనాలు, ముద్రలు ఏర్పడతాయి. మరికొంత సేపటికి శ్వాసక్రియలో మార్పు వస్తుంది. ఈ మొత్తం పనులన్నీ కుండలినీ శక్తి పైకి పోతూ తన ఇష్టం వచ్చినట్లు శరీరానికి అవసరమైన రీతిని చేయిస్తుంది.
పడుకుని యోగం చేస్తే నష్టం లేదు. అయితే ఆ యోగం నిద్రలోకి జారిపోకూడదు. నిద్ర యోగం క్రిందికి రాదు.ఎంతసేపు ధ్యానంలో వున్నా ఎరుక వుండాలి. ఎరుక వుంటే చైతన్యం కలుగుతుంది. స్పందన కలుగుతుంది. ఎరుక పోయిన క్షణంలో ‘గురుక’ పెడతారు., నిద్రపోతారు. ఆ నిద్ర రాకుండా వుండడానికి కూర్చుని యోగం చేయడం మంచిది. నిటారుగా కూర్చుని చేసినంతకాలం మగత రాదు, మత్తు కలగదు. అనుక్షణం చైతన్యం కలుగుతూ ఉంటుంది. నిటారుగా, వెన్ను బాగా నిలిపి ధ్యానం చేసినప్పుడు శరీరంలోకి కుండలినీ శక్తి నిరాటంకంగా ప్రసరించి తొందరగా స్పందన, చలనాలు, క్రియలు ఏర్పడడానికి అవకాశం వుంది. కూర్చుని యోగం చేసినప్పుడు కలిగినాన్ని ముద్రలు, ఆసనాలు, పడుకుని శవాసనంలో చేసినా కలగవు. కూర్చుని చేసినప్పుడు సగం శరీరమే కదులుతుంది.
నిలబడి చేయడం మంచిదే కాని, అన్ని ఆసన క్రియలకు నిలబడి చేయడం కుదరదు.
సిద్దాసనం, పద్మాసనం, సుఖాసనం, వీరాసనం కూడా సహజంగా ఏర్పడతాయి. మనం కస్టపడి వేయనవసరం లేదు. ఏదైనా మనకు సుఖంగా ఉండే పద్ధతి మంచిది.
కుండలినీ శక్తి ప్రసారం నిరోధించబడకూడదు. కాళ్ళు తిమ్మిరవడం లాంటివి జరుగుతుంది. అలాంటప్పుడు position మార్చుకోవచ్చు.
పాతపద్ధతుల వల్ల సాధ్యం కాని పని మన యోగంలో ఇట్టే సులభ సాధ్యమవుతుంది. యోగం ఒక్క జన్మలోనే సిద్దించాలి. ఒక యోగా పద్ధతి మనకు అనుకూలంగా లేకపోతే వదిలివేయవచ్చు.
స్పందన కలిగించాలి – అదీ యోగం అంటే.

వారం రోజుల్లో మంచి ఫలితాలు కనిపించక పోతే అది మన శరీరానికి సరిపడదని భావించాలి. మాస్టర్ యోగం ఒక్కటే అందరికీ అనుకూలం!

పతంజలిభాష్యం

మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి అధికారులూ, నాయకులూ ఉన్నారు. అయినా సమస్యలు సమస్యల్లాగే ఉన్నాయి. ఎందుకంటే సదరు నాయకులూ, అధికారులూ చాలామంది వాళ్ళ పని వాళ్ళు చేయడం లేదు. ఇలాంటప్పుడే మనకి ఆగ్రహం కలుగుతుంది. ధర్మాగ్రహం అంటారు దాన్ని. ఇది అందరిలోనూ ఉన్నా ఏ కొద్దిమందో మాత్రమే దానిని ప్రకటించ గలుగుతారు.

ఎందుకంటే ధర్మాగ్రహాన్ని ప్రకటించడానికి కావలసినవి నాలుగు.. సమస్యల పట్ల స్పందించే హృదయం, స్పందించగల తెగువ, స్పందించడానికి తగినంత భాష, ఆ స్పందనని ప్రచురించగల పత్రిక. ఈ నాలుగూ ఉన్నవాళ్ళు అతికొద్దిమంది ఉంటారు. ఆ అతి కొద్దిమందిలో ఒకరు కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి. తెలుగు సాహితీ రంగంలో కే.యెన్.వై. పతంజలిగా ప్రసిద్ధుడైన ఈ అలమండ రాసబిడ్డ వ్యవస్థపై తన ధర్మాగ్రహాన్ని ప్రకటించి భాష్యకారుడైనాడు. ఆయన ఆగ్రహానికి అక్షర రూపమే 160 పేజీల 'పతంజలిభాష్యం.'

'నేను ఫలానా రచయిత రచనలు చదివాను' అని చెప్పుకోడాన్ని కొందరి విషయంలో మనం గర్వంగా ఫీలవుతాం. నాకు సంబంధించి ఆ కొందరు రచయితల జాబితాలో పతంజలిది తిరుగులేని స్థానం. తను సృష్టించిన ఒక్క 'వీరబొబ్బిలి' పాత్ర చాలు, పతంజలి రచనలు ఎందుకు చదవాలో చెప్పడానికి. "నేను ఫ్యూడల్ ని" అని రొమ్ము విరుచుకుని చెప్పిన పతంజలి ఎప్పుడూ పేదల పక్షమే. నిజానికి ఆయనది వెన్నలాంటి మనసు. లేకపోతే దగాపడ్డ వాళ్ళ గుండె ఘోష వినగలిగేవాడే కాదు.. వాళ్ళ పక్షాన గొంతు విప్పేవాడే కాదు.

"బాధ్యతారహిత మానవ సమాజం మీద అక్షర శర సంధానం" ఇది పతంజలి భాష్యానికి ప్రచురణ కర్తలు ఇచ్చిన ఉప శీర్షిక. నిజమే.. మన సమాజం బాధ్యతారహితం కాకపోయినట్టైతే రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య ఉండేది కాదు.. బాల కార్మికులు ఉండే వాళ్ళు కాదు. రైతుల బలవన్మరణాలు ఉండేవి కాదు. లాకప్ మరణాలూ, పోలీసు ఎన్కౌంటర్లూ కూడా ఉండి ఉండేవి కాదు. ప్రజల ముఖాల్లో బతుకు భయం, చావుకళ మచ్చుకైనా కనిపించేవి కాదు. ప్రజలంతా నవ్వుతూ, తుళ్ళుతూ నిశ్చింతగా ఉండేవాళ్ళు.

మనది బాధ్యతా రహిత సమాజం కాబట్టే ఇక్కడ ఎన్నికలు కేవలం ఐదేళ్లకోసారి జరిగే తంతు. ఎన్నికలైపోయిన తరువాత దేశం 'దగాపడిన ఆడకూతురి' లాగ ఉంటుంది. పాలకులకి 'హింసా మార్గమే చక్కని రాజమార్గం' అవుతోంది. 'కత్తిని బతిమాల కూడదు.. కత్తికి విజ్ఞప్తి చేయకూడదు.. కత్తికి ధర్మాలు బోధించకూడదు..' అని చెబుతూనే 'కత్తి ప్రాణ రక్షణ కోసం కాక రక్తదాహంతో వీధిలోకి వచ్చేస్తే దాన్ని జాగ్రత్తగా మళ్ళీ ఆయుధాగారంలోకి నెట్టేయాలి.. ఆ బాధ్యత మొత్తం ప్రజలందరిది..' అంటారు పతంజలి.

నిజానికి 'పతంజలిభాష్యం' పాతికేళ్ళ చరిత్రపై రన్నింగ్ కామెంటరీ. రాష్ట్రంలో సాంఘిక,ఆర్ధిక, రాజకీయ సమస్యలు, దేశ రాజకీయాలు, విదేశీ విధానాలు, అనేక సందర్భాల్లో అమెరికా కర్ర పెత్తనం లాంటి జరిగిపోయిన విషయాలన్నీ మనకి గుర్తు చేస్తుంది. కుర్చీల్లో కూర్చున్న మనుషులు మాత్రమే మారారు, వాళ్ళు అనుసరించే విధానాలు మారలేదు అని మనం మరింత స్పష్టంగా అర్ధం చేసుకోడానికి దోహద పడుతుంది. నీళ్ళు ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకున్నట్టుగా, ఎలాంటి వ్యక్తైనా కుర్చీలో కూర్చునేసరికి అందుకు తగ్గట్టు మారిపోతాడు అని అర్ధమవుతుంది.

ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ప్రజలపై వేసిన రకరకాల పన్నులు, ఉద్యోగుల పట్ల ఆయన వైఖరి, చంద్రబాబు చాణక్యం, 'అక్షరాల' సాయంతో అధికారంలోకి వచ్చిన వైనం, అదే అక్షరాలని వాడుకుని అధికారులతో ఆడుకున్న చమత్కారం మాత్రమే కాదు, కేంద్రంలో పీవీ 'చాణక్యం', వాజపేయి 'రాజనీతి,' సోషలిస్టు జార్జి ఫెర్నాండెజ్ జార్జి, ఫెర్నాండెజ్ అనే ఇద్దరు నాయకులుగా విడిపోయారన్న నిష్టుర సత్యం, కాశ్మీర్ సమస్యపై అమెరికా అనవసర జోక్యం, మన నాయకుల పొంతనలేని సమాధానాలు.... ఎన్నో, ఎన్నెన్నో అంశాలు.

గత పాతికేళ్ళ కాలం లో వివిధ పత్రికల్లో పతంజలి రాసిన 56 వ్యాసాల సమాహారం ఈ పుస్తకం. పతంజలిని గురించి ఆర్.కే. విశ్వేశ్వర రావు (ప్రచురణ కర్త), రావి శాస్త్రి, 'మో' రాసిన వ్యాసాల తో పాటు, పతంజలి స్వయంగా రాసిన 'నేపధ్యం' ఇంకా రమణజీవి చేసిన పతంజలి 'చివరి ఇంటర్వ్యూ' లనూ చదవొచ్చు. ఈ తెలుగు పుస్తకం సైజుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వెల ఎక్కువే అనిపిస్తుంది. మన చుట్టూ ఏం జరిగిందో, జరుగుతోందో తెలుసుకోడానికి తప్పక చదవాల్సిన పుస్తకం. (పర్స్పెక్టివ్స్ ప్రచురణ, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు) 

సర్వరోగ నివారిని ప్రాణాయామం

తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు న్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం గురించి  తెలుసుకుందాం.

1.ప్రాణాయామ విశేషాలు

ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది.

ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌’’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.

ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్‌ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.మెడికల్‌ సైన్స్‌ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు.


వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.

2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు


  • ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
  • శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.
  • రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా
  • బయటికి వెళ్లి పోతుంది.
  • గుండెకు సత్తువ లభిస్తుంది.
  • మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
  • ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
  • జఠరాగ్ని పెరుగుతుంది.
  • శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.

    3. తీసుకోవలసిన జాగ్రత్తలు
    • మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని,
    • కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
    • గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
    • మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
    • సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
    • పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.
    • ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు.
    • అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
    • ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
    • పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.
    • నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
    • నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి.
    • ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు
    • రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.
    • ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.
    • ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.

మంత్రానికి శక్తి వుందా?

మంత్రం ద్వారా, పూజ ద్వారా, ప్రాణాయామ యోగసాధన ద్వారా, యజ్ఞ యాగాదుల ద్వారా ఎలాగైనా సిద్ధిని సాధించవచ్చు దైవశక్తిని దర్శించ వచ్చును.

"పసులవన్నె వేరు పాలేకవర్ణమౌ
పుష్పజాతివేరు పూజయొక్కటె
దర్శనంబు వేరు దైవంబు యొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ"

అన్నాడు వేమన. అలాగే ఊపిరిని ఆధారంగా ఉచ్చ్వాస నిశ్వాసలతో మంత్ర జపం వున్నాలేకున్నా నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని ఉపాసించినవారుకూడ వున్నారు. ఇది అత్యంత ప్రాచీనమైన 'స్వర శాస్త్రం ', యోగంలో అతి ప్రధానాంగం. ఇక్కడ స్వర శాస్త్రం అంటే సంగీతంలో స్వరం కాదు. ఉచ్చ్వాస నిశ్వాసల కలయిక స్వరం. ఇది ప్రాణాయామానికి కూడా పై మెట్టు.

ఇప్పడికే ప్రాణాయామం ద్వార యోగ సాధన చేయడం, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం మంచిదని ప్రపంచం అంతా గుర్తించింది. ఈ పద్దతులని ఈనాడు శాస్త్రబద్దంగా ఋషిప్రోక్తమైన విధానాలకి అనువుగా అనేక మందికి నిజమైన ఆరోగ్యాన్ని పొందుతున్నారు. సక్రమమైన సాధనా పద్ధతిని అందిచే కృషి చేస్తున్నారు, పతంజలి, వసిష్టుడు వంటి ఋషులు అందించిన యోగ సూత్రాలను మానవాళి అభ్యున్నతికి వాడుతున్నారు. అందులో తెలుగు గడ్డపై జన్మించి తెలుగులో యోగాన్ని అందించిన వేమన, వీరబ్రహ్మం గారు, గణపనారాధ్యుడు లాంటి వారిని మనం మరిచిపోలేం. ఆశ్చర్యమేమిటంటే దాదాపు క్రీ.శ.1295 ప్రాంతానికే గణపనారాధ్యుడు 'స్వర శాస్త్రమంజరి ' అన్న గ్రంధాన్ని తెలుగులో రచించాడు, మూలమైన యోగసాధనలని తెలుగులో అందించాడు. బ్రౌన్ దొరగారు 1845 లో ప్రాచ్య లిఖిత గ్రంధాలని మద్రాసు లిటెరరీ సొసయిటికి అందించినప్పుడు ఈ తాళపత్రం కూడా అక్కడికి చేరింది. గణపనారాధ్యుడు చెప్పిన ప్రాణాయామ 'నాడీ శోధన ' ఇలా వుంది .

"అరుణ సూర్యోదయంబున నప్పుడే లేచి
కూర్చుండి పవనంబు గూర్చి శొధించి
నాళ్ళను శుద్ధిగా జేసి శుభ తత్వములతోడ "

గణపనారాధ్యుడు కేవలం ప్రాణాయామం యోగం కాదని వాయు సాధనలో మనసు శివుని మీద (సర్వేశ్వరుని మీద) లగ్నం చేయాలని ధ్వనించాడు. పద్మాసనంలో నిటారుగా కూర్చొని సాధన చెయ్యాలి అని చెప్పాడు.

"పవ్వాసనంబున బైనికవెట్టి
వీపును విరుచుచు వీపు నిక్కుచును
వాయువుల్ పట్టుచు వదలుజేయు
చుండుట యోగమే? యుండగోరెదవు
శివుతోడ గూడక శివయోగి యగునే? "

గణపనారాధ్యుడి నుండి వేమనకు, వేమననుండి వీరబ్రహ్మం గారి వరకు 'కుండ ' అన్న మాట కుండలినికి పర్యాయ పదంగా వచ్చింది. కుండలిని సాధనతో వైరాగ్య మోక్షాలని పొందమని ఈ యోగమూర్తులు చక్కని తెలుగులో చెప్పారు.

గణపనారాధ్యుడు:

"నీ కట్టినింటిలో నీ కుండ కలదే?
పరమార్ధ సంపద పరికింప వేల?
అస్థిర సంపద లమర నేమిటికి?
ముక్తి కామిని యుండ మూర్ఖవై కోరి? "

వేమన: కింది పద్యంలో రెండు అనగా నాడుల సంకేతంగాను, కుండ అంటే కుండలిని సంకేతంగాను చెప్పాడు.

"రెండు రెండు రెండు రెండు రెండును వీడి
రెంటి మీదనున్న యొంటి లెక్క
కుండలోన జూచి గుడి సుఖంబుననుండు
విశ్వదాభిరామ వినుర వేమ"

పోతులూరి వీర బ్రహ్మం గారు:

"కుండ భేదించరా గురుని నీలో తెలియర కుండలి పైగ నుండి చంద తేజము గాంచరా"
ఈ వీర బ్రహ్మం గారి పద్యంలో 'కుండలి పైగ నుండి చంద తేజము ' రహస్యము, అలోచింపదగిన సాంకేతికార్ధము. కుండలినిని సాధించి, ఆజ్ఞా చక్రము నుండి సహస్రారము వైపు సాగిన తరువాత యోగికి అమృతత్వ సిద్ధి కలుగుతుందిట. ఈ సిద్ధికి మూలమైన యోగ శక్తి కుండలిని సహస్రారం చేరిన తరువాత బిందువులు బిందువులు గా పడుతుంది, యోగికి తెలుస్తుంది - అతని సాధనా సంపత్తి వల్ల యవ్వన వంతునిగానో, శక్తి సంపన్నుని గానో మహా యోగి అయితే చిరంజీవి గానో చేస్తుంది. ఈ అమృతత్వ సిద్ధి వల్లనే యోగులు వందల, వేల సంవత్సరాలు ఇంకా యుగాలు కూడా జీవిస్తున్నారుట. ఈ అమృత సిద్ధినే అమృత భాండంగా వర్ణించారు. అమృత భాండాన్ని 'చంద్ర వంక 'గా చిత్రీకరించడం, కవులు వర్ణించడం చేసారు. అందుకే హాలాహలం పుట్టాక శివుని తలమీద (సహస్రార చక్రం దగ్గరన్న మాట) చల్లదనంకోసం అమృత భండాన్ని పెట్టారు. అప్పుడు శివుడు 'సోమ శేఖరుడు ' అయ్యాడు. సోమ రసము అంటే అమృతమని మనకి తెలుసు కదా! చంద్రునికి 'సోముడు 'అని పేరు, సోమవారం కూడా ఆయనదే! అందుకే శివుడు 'చంద్ర శేఖరుడు 'కూడా అయ్యాడు, సోమవారం ఆయనకి ప్రీతికరమైనది.మరి చంద్రుడు సుధాకరుడయ్యాడు. ఈ అమృతం కోసమే దైవ శక్తులు, అసురీ శక్తులు క్షీర సాగరాన్ని మధించాయి, మహా సర్పమైన వాసుకిని తాడుగా వాడుకున్నాయి. శ్రీ మహా విష్ణువే స్వయంగా కూర్మంగా తర్వాత జగన్మోహినిగా రావాల్సి వచ్చింది.

ఇందులో నిగూఢార్ధాలు చాలా వున్నాయి. జీవి దేహము, పోషణావసరమున్న ఈ భౌతిక ప్రపంచమే క్షీర సాగరం. కూర్మావతరం - గట్టి నిశ్చయం, పతంజలి యోగ సూత్రాలలో చెప్పిన 'కూర్మ నాడి 'అనే సిద్ధి. వాసుకి, పాము కుండలిని శక్తి అని వేరే చెప్పక్కర్లేదు. ఇక దేవతలు, రాక్షసులు ఎవరూ అంటే భగవత్గీతలో దైవాసుర సంపద్విభాగయోగంలో చెప్పినట్టు మనిషిలో కలిగే సత్ చింతనే దేవతాశక్తి, భావదారిద్ర్యం వల్ల కలిగేది-మానవత్వానికి దూరమైనది దానవ శక్తి. క్షీర సాగర మధనమే సాధన, తపస్సు. తపస్సు ఫలితంగా ముందు పూర్వజన్మ కృతమైన పాపం హాలాహలం లోకాలన్నిటి ముంచేస్తుంటుంది. అంటే మానవుడు మహోన్నతమైన లక్ష్యాలని సాధించాలని బయలు దేరితే ముందు పూర్వజన్మలో అంటే ముందు 'కాలం 'లో విష కర్మలన్ని 'కాలకూట 'విషంగా వచ్చి మనిషిని నిస్తేజునిగా చేస్తుందన్నమాట. ఆ విషాన్ని, అంటే కాలకూట మైన కర్మని హరుడు వచ్చి హరిస్తాడు. ఆ విషాన్ని హరించిన హరుడు శ్రీకరుడౌతాడు. 'శ్రీ ' అంటె సంస్కృత భాషలో ఒక అర్ధం విషం. శ్రీకరుడైన శంకరుడు అలా పాత పాపాలని హరించి కొత్త జీవితాని కి శ్రీకారం చుడతాడు. అలా కల్లోలాన్ని, జీవన ప్రళయాన్ని పోగొడతాడుకనక ఆయన్ని 'శం కరుడు ' అన్నాం. శం అంటే శాంతి అని అర్ధం. శంకరుడు అంటే శాంతిని కలిగించేవాడు అని అర్ధం. ఆయన తన జ్ఞాన నేత్రం ఇచ్చి కళ్ళు తెరిపిస్తాడు,దివ్యదృష్టిని ఇస్తాడు. దివ్యదృష్టి అంటే కళ్ళుమూసుకుని ఎక్కడి విషయాలో చెప్పడం కాదు, దివ్యంగా దర్శించగలగడం. అంటే దేముడిలా విషయాలని మైత్రి, కరుణ, ముదితలతో చూడగలగడం.

దేవతలు, దానవులు అందరూ సాధనచేస్తారు. కేవలం దేవలకే అమృతత్వ సిద్ధి కలగాలి. మరి ఈ ప్రపంచంలో అంతా కలిసే వుంటాయి కదా! వాటిని వేరుచేయడం ఎలా? అందుకే శిష్యున్ని పరిక్షించకుండా గురువు విద్యనివ్వడు, భక్తుడిని పరిక్షించకుండా దేవుడు వరమివ్వడు. 'ది లాస్ట్ టెంప్టేషన్ ' పరీక్షించడానికి జగన్మోహనుడైన మాయకాడు మహావిష్ణువు జగన్మోహినిగా వస్తాడు. అరిషడ్వర్గాలని జయించిన రాజయోగి యోగిరాజై మోహబంధాలకి చిక్కక పరాముక్తుడౌతాదు, సాక్షాత్ పరమేశ్వరుడు అవుతాడు, పరమాణువులో అద్భుతశక్తిని, పరిభ్రమించే గ్రహ నక్షత్ర గోళాలకుమించిన ఆ పరాశక్తిని సాక్షాత్కరింపచేసుకుంటాడు. ఇలా మంచి చెడులని విడకొట్టే శక్తిని పొందిన యోగిని 'పరమహంస ' అని అంటున్నాం. ఎందుకంటే పాలని, నీళ్ళని విడకొట్టే సహజ శక్తి హంసకే వుందిట.

మనశ్శాంతి లేని వారు చంద్రుడిని ధ్యానిస్తే మండలం రొజుల్లో ఫలితం కనిపిస్తుందని శాస్త్రం చెపుతోంది. ఆటిజం వంటి సమస్యలకు ఈ మంత్రాన్ని బుధ మంత్రంతో బాటు సాధన చేసి ఆ శక్తిని ధారపోస్తే చెప్పుకోదగిన ఫలితం వుందని లోక క్షేమం కోరే కొందరు మంత్ర సాధకులు చెపుతున్నారు.

తంత్రము - దశమహావిద్యలు

తంత్రాలు, తంత్ర ప్రక్రియలు చాలా ప్రాచీనమైనవి.ఇష్టకామ్యసిద్ధి కోసం ప్రాచీనకాలం
నుండి తంత్ర ప్రక్రియలు చేయటం జరుగుతూనే ఉన్నది. శాస్త్రగ్రంథాలలో
తంత్రశాస్త్రానికి చాలానే ప్రాధాన్యాన్ని ఇచ్చారు.
విష్ణుర్వరిష్ఠో దేవానాం హ్రదానాముదధిస్తధా
నదీనాంచ యథాగంగా పర్వతానాం హిమాలయః
అశ్వత్థః సర్వవృక్షాణాం రాజ్ఞామింద్రో యధావరః
దేవీనాంచ యథాదుర్గా వర్ణానాం బ్రాహ్మణో యథా
తథా సమస్త శాస్త్రాణాం తంత్రశాస్త్ర మనుత్తమం
సర్వకామప్రదం పుణ్యం తంత్రంవై వేదసమ్మితం
మహావిశ్వతారతంత్రంలో దాదాపు 64 తంత్రగ్రంధాల ప్రస్తావన ఉంది.

వాటిలో మేరుతంత్రము, శారదాతిలకతంత్రము ప్రామాణికమైన గ్రంధాలు.
కౌళావళి నిర్ణయమనే గ్రంధంలో 72 తంత్రగ్రంధాలు ప్రస్తావించబడినాయి.
అవి రుద్రయామళము, బ్రహ్మయామళము, విష్ణుయామళము, శక్తియామళము,
భావ చూడామణి, తంత్ర చూడామణి, కుల చూడామణి... ఇత్యాదులు.

వామాచారులు, దక్షిణాచారులని తంత్రవాదులు / సాధకులు రెండు రకాలు.
వామాచారంమద్యం మాంసం తధా మత్స్యం ముద్రా మైధునమేవచ
మకార పంచకంచైవ దేవతా ప్రీతికారకం
మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైధునము ఇవి అయిదు పంచ మకారాలు.

ఈ మకార పంచకంతో చేస్తేనే తప్ప, మంత్రసిద్ధి కలుగదని వామాచార సంప్రదాయబద్ధమైన
కులతంత్రాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా, సదాచార నిషిద్ధములైన ఈ వామాచారాన్ని
సంప్రదాయ విరుద్ధంగానే భావించాలి. వస్తుతః పంచ మకారాలు ప్రతీకాత్మకాలు.
బ్రహ్మరంధ్రం నుంచి స్రవించే మధువునే మదిర అంటారు. వాసనారూపమైన
పశుత్వాన్ని ఖండించటమే మాంసం. ఇడా పింగళా నాడుల మధ్య ప్రవహించే
శ్వాసలే మత్స్యం. ప్రాణాయామ ప్రక్రియల చేత ప్రాణాన్ని అవరోధించి,
సుషుమ్నానాడిలో నశింపజేయడమే ముద్ర. సహస్రారంలోని శివునితో
శక్తిరూపమైన కుండలినిని మేళవించడమే మైధునం. కాలాంతరంలో,
అవివేకులు, శరీరభోగనిష్ణాతులు ఈ సాధనను వక్రమార్గం పట్టించారు.
వామాచార ప్రక్రియలను వ్యతిరేకించుటకు ఇదే కారణం.

దక్షిణాచారం
దక్షిణాచారానికి శౌచం ప్రధానం. ఆహార విహారాదులలో కఠిన నియమ నిష్టలతో
ఉండి సాధన చేయాలి. జపదీక్ష చేసే స్థలం విషయంలో కూడా జాగ్రత్త అవసరం.
దీక్షా సమయంలో ఏకభుక్తులై, భూశయనులై, బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి.
ఏది ఏమైనా, వామాచారులు, దక్షిణాచారులు ఒకరి మార్గంలో మరొకరు

ప్రవేశించటాన్ని తంత్రశాస్త్రాలు నిషేధిస్తున్నాయి. వేదవిద్య అయినటువంటి
గాయత్రీ మంత్రసాధన వామాచారంలో చేయాలనుకోవటం ఎంత బుద్ధిహీనమో,
ఆవిధంగానే, ఉచ్ఛిష్టగణపతి విద్యను దక్షిణాచారంలో సాధించదలచటమూ
అంతే బుద్ధిహీనము.
తంత్రగ్రంధాలలో శాక్తేయవిద్యల ప్రస్తావన వచ్చినప్పుడు దశమహావిద్యలకు

ఉన్న ప్రాధాన్యం కనిపిస్తుంది. ఈ దశమహావిద్యల ఆవిర్భావం గురించి
అనేకరకాలైన కథలు వ్యాప్తిలో ఉన్నాయి. దేవీభాగవతంలో కథ ఈరకంగా ఉంది.
దక్షప్రజాపతి పిలవని యజ్ఞానికి వెళ్ళితీరాలని సతీదేవి పట్టుపట్టటంతో శివుడు క్రోధించాడు. క్రోధాగ్నిరూపుడైన శివుని చూసి, సతీదేవికి అంతకుమించిన కోపం కలిగి భీషణరూపం

ధరించింది. శివుడు విముఖుడై వెళ్ళిపోవడానికి ఉపక్రమించగా, సతీదేవి దశరూపాలు
ధరించి దశదిశలా అడ్డు నిల్చున్నది. ఆ దశరూపాలే దశమహావిద్యా రూపాలు.

కానీ, శివపురాణంలో మరో కథ ఉంది.
రురుడనే రాక్షసుని కుమారుడు దుర్గముడు. బ్రహ్మ వలన వరం పొంది

సమస్త వేదాలాను అపహరించుకుపోయాడు. వేదోక్త కర్మలు, యజ్ఞయాగాదులకు
ఆటంకం కలిగింది. దేవతల ప్రార్ధనలు విని, వేద పునరోద్ధారణకు దేవి నడుం కట్టింది.
ఆ దేవి శరీరం నుండి ఉధ్బవించిన మూర్తులే :
కాళి, తార, ఛిన్నమస్త, బగళాముఖి, మాతంగి, ధూమావతి, భువనేశ్వరి,

షోడశి, కమలాత్మిక, భైరవి.

యోగ

సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయమైన భారత దేశానికి అత్యంత ప్రాచీనమైన సంపద యోగ.భారత సంతతికి వంశపారంపర్యంగా, గురూపదేశంగా నేటికీ విడువకుండా అనుసరిస్తూ వస్తున్న ఏకైక హృదయ తరంగమిది. ఇది భారత ఋషుల అద్భుత సృష్టి. ఈ సృష్టికి 5 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. మనసుని అధీనంలో ఉంచుకోవడం ద్వారా ప్రాణ శక్తిని పెంపొందించడమనే ఈ ప్రక్రియ అద్భుతాలలోకెల్లా అద్భుతం. ఎటువంటి ఔషధాలూ, శస్త్ర చికిత్సలూ అవసరం లేకుండా కేవలం చిన్న చిన్న వ్యాయామాల ద్వారా దీర్ఘకాలిక రోగాలనుండి విముక్తులు కావడం వైద్య శాస్త్ర రంగానికి ఓ చాలెంజ్.

క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యాన్ని అలవరచుకోవడానికి యోగ అనువైన విధానం. ప్రత్యామ్నాయ వైద్య విధానంగా అమిత ప్రాచుర్యంలో ఉన్న యోగ నియమబద్ధమైన ఆహారం, అలవాట్లు ఉన్నవారికే సాధ్యం. సహజసిద్ధమైన ఆహారం యోగా అభ్యాసకులకు అతి ముఖ్యం. తీపి పదార్ధాలు, రసాయనాలు కలిపిన పదార్ధాలు వీరికి నిషిద్ధం. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలి. నేటి ఆధునిక జీవనం ఇందుకు ఏమాత్రం అనువుగా లేకపోవడంతో యోగ సాధన కష్టసాధ్యమైనా, యోగానే జీవన విధనంగా ఎంచుకుంటే ఎవరి ఆరోగ్యం వారి అధీనంలోనే ఉంటుంది.

ఆసనం అంటే?

ఆసనం పుట్టుక గురించి మూలాధారాలు లేవు. మనిషి పుట్టిన నాటినుంచి అది ఉంది. ఉయ్యాలలోని పసిబిడ్డ చేసే విన్యాసాలు కూడా ఆసనం క్రిందే వస్తాయి. మనిషి శారీరకంగా వ్యక్తపరచే ఏ భంగిమనైనా ఆసనం అనవచ్చు. ఐతే ఆ భంగిమలు ఒక క్రమపద్ధతిలో ఉండాలి. వాటికి తగినంత వ్యాయామం ఉండాలి. ఆసనాలు ఎన్ని అనడంలో భేదాభిప్రాయాలున్నా మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడానికి కనీసం 25 ఆసనాలైనా వేయడం ఉత్తమమని యోగ పండితులు చెబుతారు. వాటిలో పద్మ, చక్ర, సర్వాంగ, హల, ధను, మయూర,పశ్చిమోత్తన, శీర్ష, శవాసనాలు తప్పకుండా వేయాల్నిన ఆసనాలు.

భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ, ఉపనిషత్తులలో మహర్షులు అత్యంత యోగ విజ్ఞానాన్ని అందించారు. యోగాలలో కూడా పలు రకాలున్నాయి. అవి రాజ యోగము, హఠ యోగము, కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగము...ఇంకా అనేకం. రాజ యోగాన్ని శ్రేష్టమైనదిగా చెబుతారు. యోగాసనాలతోపాటు నేతి, ధౌతి, భస్తి, త్రాటకం, కపాలభాతి మొదలైన హఠ యోగ క్రియలు కూడా నేడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కానీ వీటిని అభ్యసించేవారు చాలా తక్కువ.యోగాసనాలు ఎందుకు వేయాలి?

మానవ శరీరం మాలిన్యాల పేటికలాంటిది. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. మాలిన్యాలే అనారోగ్యానికి మూలకారణం. వాటిని నిర్వీర్యం చేయనిదే ఆరోగ్యం సాధ్యం కాదు. మాలిన్యాల నిర్మూలకు యోగా చక్కని పరిష్కారం. యోగ వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల పెద్దగా కష్టపడనవసరంలేని యోగాసనాలు చేయడం ప్రతి ఒక్కరికీ అవసరం.

అర్హత?

వయసుతో నిమిత్తం లేదు. పసిపిల్లాడినుంచి పండు ముదుసలి వరకు అందరూ అర్హులే. దీనికి స్త్రీ, పురుష విచక్షణ అంతకంటే లేదు. శారీరక దృఢత్వంతో అవసరం లేదు. పరికరాల ఊసే లేదు. ఒక్క రూపాయి ఖర్చు కూడా కాదు. అందరూ అర్హులే. అంతటా అర్హతే.

యోగ చికిత్స అంటే ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులు, ముద్రలు, బంధాలు, క్రియల సహాయంతో ఆరోగ్యవంతులను చేసే విధానం. పతంజలి మహర్షి 195 సూత్రాలను "యోగ సూత్రాలు" అనే గ్రంధంలో క్రోడీకరించాడు. ఒక్కో యోగాసనం ఒక్కో అనారోగ్యాన్ని నయం చేస్తుంది. దీర్ఘకాలిక రోగాలకు దీనిని మించిన చికిత్స లేదు. కాబట్టే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా యోగ థెరపివైపు మొగ్గుచూపుతున్నారు. యోగ అంటే ప్రకృతికి సన్నిహితంగా సహజీవనం చేయడమే. ప్రకృతి వైద్య విధానంలో ఇది ఒక భాగం. సహజసిద్ధమైన ఆరోగ్యానికిది ఇది చక్కని మార్గం. స్థూలకాయం, మధుమేహం, రక్త పోటు, ఉదరకోశ వ్యాధులు, మలబద్ధకం, కీళ్ళు మరియు నడుము నొప్పులు రాకుండా ఉండాలంటే యోగా ఒక్కటే మార్గమని అనుభవపూర్వకంగా తెలుస్తోంది. యోగా ద్వారా ఆరోగ్యమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది కాబట్టి కాబట్టి వెంటనే ప్రారంభించడం ఉత్తమం.




యోగ సాధనతో వ్యాధులు దూరం

పతంజలి మహర్షి యోగని ఎనిమిది భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి అయిదు ధ్యానసాధనలో బాహ్యంగా సహాయపడితే, చివరి మూడు అంతర్గత శక్తులను వెలికి తీసేందుకు దోహదం చేసి, యోగ సాధన ఫలాలను యిస్తాయి.

ఎనిమిది విధానాలు:
యమ: ఒక సైనికుడి ఆయుధాలను అప్పగించినప్పుడు ముందుగా క్రమశిక్షణ నేర్పుతారు. ఎప్పుడు వాటిని ప్రయోగించాలి అనే విషయంతో పాటు సమాజ పరిరక్షణకు, శాంతి స్థాపనకు ఎలా ఉపయోగపడాలనేది అవగతం చేసుకుంటారు. జీవిత విధానంపై, ప్రవర్తనపై నిర్దిష్టమైన క్రమశిక్షణ వుండాలి.
ఆ అయిదు అంశాలు:
1.
అహింస
2.
సత్యం
3.
బ్రహ్మచర్యం
4.
దొంగతనానికి పాల్పడకపోవడం
5.
కోరికలను అదుపులో ఉంచుకోవడం
ఈ అయిదు అంశాలను పాటించినప్పుడే యోగ సాధకుడు ముందు అడుగు వేయగలడు.
నియమాలు: యోగ సాధన ఈ దేహంతోనే చేయవలసి వుంటుంది. అందువల్ల శరీరం రోగగ్రస్తం కాకూడదు. ఆరోగ్యంగా, ధృఢంగా వుండాలి. ప్రకృతిలోని ఎటువంటి మార్పులని అయినా తట్టుకునే శక్తి కలిగి వుండాలి. వాంఛలు అదుపులో వుండాలి. సాధకుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలగాలి. ఆ అనంతశక్తిని తెలుసుకోవాలనే జ్ఞానతృష్ణ కలిగి వుండాలి. పతంజలి మహర్షి సూచించిన అయిదు నియమాలు ఇవి:-

1.
పరిశుభ్రత
2.
సంతృప్తి
3.
సంయమం
4.
ధర్మశాస్త్రాల అధ్యయనం
5.
ప్రతి చర్యను భగవత్‌ అర్పితం చేయడం
ఈ అయిదు నియమాలను పాటించడంతో సాధకుడికి మానసికంగా, శారీరకంగా ప్రయోజనం చేకూరుతుంది.
ఆసనాలు: ప్రస్తుత కాలంలో యోగ పేరు చెప్పగానే అందరూ యోగాసనాల గురించే మాట్లాడుతున్నారు. హఠయోగంలో ఆసనాలు ఒక భాగం.
పతంజలి మహర్షి ఏనాడూ యోగాసనాలు పాటించాలని ఖచ్చితంగా చెప్పలేదు. కేవలం విశ్రాంతిగా, స్థిరంగా కూర్చునే ఆసనాన్ని మాత్రమే సూచించారు పతంజలి. పద్మాసనం కూడా అనుమతించారు. ఆసనాలతో శరీరంలోని భౌతికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. వేడి, చలిలాంటి ఉష్ణోగ్రత స్థితులపై అదుపు లభిస్తుంది. హఠయోగంలో పేర్కొన్న ఆసనాలను పాటించడంలో ఎటువంటి వ్యతిరేకత లేదు కాని, అత్యున్నతమైన సమాధిస్థితిని చేరుకోవడానికి యిది ప్రామాణికం కాదు.
ప్రాణాయామం: హఠ యోగంలో పేర్కొన్న వ్యాయామాల గురించి, పతంజలి మహర్షి ఎలా నొక్కి చెప్పలేదో, అలాగే శ్వాసక్రియ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. కేవలం ఏకాగ్రతతో, నెమ్మదిగా, గాఢంగా ఊపిరి పీల్చి వదలడం మాత్రమే ఆయన సూచించారు. ఇలా ఉచ్ఛాశ్వ, నిశ్వాసక్రియ చేయడం వల్ల ఇంద్రియాలపై అదుపు ఏర్పడుతుంది. ఏకాగ్రతని వ్ధృది చేస్తుంది. అనునిత్యం సాధనం చేయడం వల్ల మాత్రమే యిది సాధ్యపడుతుంది.
ప్రత్యాహర: ఇంద్రియ నిగ్రహమే ప్రత్యాహర. ఇంద్రియ నిగ్రహం అంటే కేవలం వాంఛల నియంత్రణ, వైరాగ్యం పెంపొందించుకోవడం, ధర్మశ్త్రాసాల్లో చెప్పినట్లు నడుచుకోవడమే కాదు. నిరంతర ఏకాగ్రత సాధనతో జాగ్రదావస్థని దాటివుండటం. మెదడుని అదుపులో ఉంచడానికి నిరంతరం హృదయం, ఇంద్రియాలు ప్ర్నయతిస్తుంటాయి. వాటిని జయించడానికి పైనచెప్పినట్లు నిరంతర సాధన, ఏకాగ్రత అవసరం.
ధారణ: సాధనలో పై అయిదు దశలు దాటాక, శరీరం, శ్వాసక్రియ, మనసు సాధకుడి అదుపులోకి వస్తాయి. ఇప్పుడు ఏకాగ్రతపై దృష్టి నిలపాలి. సాధకుడు ఓ ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని, ఓ నిరిద్దష్టమైన వస్తువుపై దృష్టి కేంద్రీకరించాలి. ప్రతి రోజూ యిలా సాధన చేయడం వల్ల సాధకుడు ఏకాగ్రతలో ఓ ఉన్న్థతసితిని చేరుకుంటాడు.
ధ్యానం: ఆలోచనల ప్రవాహానికి ఆనకట్ట వేయడానికి ధ్యానాన్ని మించినది లేదు. ధ్యానంలో ఒక వస్తువుపై దృష్టి నిలిపినప్పుడు, క్రమేపీ ఆలోచనలు అంతరిస్తాయి. తనకి, ఎదురుగా వున వస్తువుకి తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ దశలో ఇంద్రియాలు, మనసు కూడా ఆ ్తవసువు వైపే లగ్నమవుతాయి. ఏకాగ్రత అనేది సహజసిద్ధంగా ఏర్పడుతుంది. ఇదొక అత్యున్నత స్థితి. ఈ స్థితికి చేరుకున్నాక సమస్యలను అర్ధం చేసుకోవడమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా గోచరిస్తాయి.
సమాధి: ధ్యానానికి, యోగకి యిదే పతాకస్థాయి. సాధకుడు తను అనే అహాన్ని మరిచి, ఏ శక్తిని/వస్తువుని తన దృష్టి లగ్నంగా చేసుకున్నాడో ఆ శక్తి, తాను ఒకటే అనే స్థితికి చేరుకుంటాడు. హద్దులన్నింటిని దాటుకుని, ఈ ఉన్నతస్థితికి చేరుకున్న వ్యక్తిని ‘యోగి’ అంటారు. సమాధి స్థితికి చేరుకున్న సాధకుడు ప్రకృతిని అర్ధం చేసుకోవడమే కాదు, స్పర్శించగలడు, ప్రకృతిలోని ప్రతి అణువుతోనూ అనుభూతి చెందగలడు. ఈ అపూర్వ శక్తితోనే వేద ఋషులు కంప్యూటర్ల వంటి సాంకేతిక సహకారం లేని కాలంలోనే నాలుగు లక్షల సంవత్సరాలకు ఒకసారి గ్రహాలన్నీ ఒకే రేఖలోకి వస్తాయని, అదే యుగాంతమని కనుగొన్నారు

Monday, June 24, 2013

సద్గురు సుభాషితాలు


హిమాలయ సానువులు.ఎంతో దూరప్రయాణం తరువాత ఆ యువకుడు అక్కడ దిగాడు.అతని రెండు బట్టల మూటలను మోసుకొంటూ,కొండ ఎక్కడానికి,అక్కడున్న గాడిదాల్ని బాడుగకు మాట్లాడుకున్నాడు.
      
      "ఎక్కడికి వెళ్ళాలి సాహెబ్?" గాడిదను నడిపేవాడు అడిగాడు.
      "ఏదైనా ఒక మంచి ఆశ్రమానికి పద"
      "ఎన్నాళ్లు వుంటారు?" అని అడిగాడు
      
      "రోజులా? ఇక నా జీవితం ఇక్కడే గడపాలనుకున్నాను. నా భార్యా పిల్లలు,అమ్మ,నాన్న,వ్యాపారం అన్నీవదిలిపెట్టి వచ్చేశాను. ఇదుగో నా మెడలోవున్న ఈ బంగారు గొలుసు కూడా నీకిచ్చేసి వెళ్లిపోతాను"
గాడిదను తోలేవాడు ఆశ్చర్యపోయాడు. "ఇంత చిన్న వయసులో మీకు ఇదెలా సాధ్యం అయింది?"
ఆ యువకుడి ముఖంలో కాస్త గర్వం తొణీకింది.

"మా ఊరు వచ్చిన ఒక గురువుగారు చెప్పినటువంటి విషయం నన్ను లోతుగా ఆలోచింపచేసింది.కదలించింది.
ఆశలే దుఃఖాలకు మూలకారణమట.అందుకే అన్ని ఆశల్నీ త్యజించి వచ్చేశాను"

"అన్నీ వదిలేసి మరి ఈ మూటాల్లో ఏం తెచ్చారు సాహెబ్?" అని అడిగాడతను.

"ఇక్కడ చలి ఎక్కువని చెప్పారు. కావాలంటే దగ్గర్లో అంగళ్లు కూడా వుండవు కదా!
ఈ మూటల్లో నాకు కావలసిన కంబళ్లు తెచ్చుకున్నాను"

కంబలి వద్దని వదిలేయకలేకపోయినా, ఆశను త్యజించానని చెప్పుకుంటున్న ఆ యువకుడిలాగే ఎందఱో ఆశను గెలిచామనీ, త్యజించామనీ (చెప్పుకొని తిరుగుతుంటారు) చెప్పుకుంటున్నారు.

          ఆశలేనిదే ఈ ప్రపంచం లేదు. ఆశలేనిదే ఈ శరీరం ఉండదు. ప్రాణం నిలవదు. దేనినీ ఆశపడకూడదని ఈ ప్రపంచం మీకు చెప్పలేదు.ఆశను వదిలేస్తే అంతా సరిగా ఉంటుంది అనుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
ఆశను త్యజించాలని నిశ్చయీంచుకున్నాను అంటూ మీ మనసు మిమ్మల్ని మభ్యపెడుతుంది. సన్యాసం గురించి ప్రసంగిస్తుంది.

         మనసు చాలా తంత్రాలు నేర్చినది. ఏదేదో చెప్పి మిమల్ని నమ్మించి ఏమ్మార్చగలదు. ఆ చాకచక్యం దానికుంది. అయితే మరి శరీరం మాటెంటి? గాలి చొరబడకుండా మీ నోరు, ముక్కు మూసుకుని వేడుక చూడండి.ఒక్క నిమిషం, లేదా రెండు నిముషాలు శరీరం సహిస్తుంది. తర్వాత, బతకాలానే కోరిక మీలో పుట్టి బలం పుంజుకొని మీ చేతిని బలవంతంగా నెట్టివేస్తుంది.

         పోగొట్టుకున్న క్షణాల్ని కలిపి ఆక్సిజన్ను త్వరత్వరగా పిల్చుకొంటుంది. ఆశలు లేవంటూ మీ మనసు చెప్పే తాత్వికమైన కబుర్లు మీ శరీరం దగ్గర ఏమాత్రం  పనిచేయవు. ఎందుకంటారు, దానికి అబద్దం చెప్పి ఏమార్చడం చేతకాదు. శరీరం మొత్తం గురించిన మాటలెందుకు? అందులోని ప్రతి 'జీవకణం' ఆశతోనే జీవిస్తుంది.

         అతిధిగానైనాసరే ఒక రోగక్రిమి అందులోకి ప్రవేశించనీయండి. వెంటనే ప్రతి ఒక 'జీవకణం' ఆయుధాల్ని సిద్దం చేసుకొని పోరు మొదలుపెడుతాయి.

         ఎందుకలా?  ప్రపంచం బతకాలనే కోరిక దానికి నేర్పింది. ఇంకా లోతుగా తరచి చూస్తే, ఆశను త్యజించాలని   అనుకుంటే అది కూడా ఆశేకదా?

          మీ ఊరికి ఒక సన్యాసి వచ్చాడు."నువ్వు సంపద మీద ఆశ పెంచుకున్నావు. అదే నీ దుఃఖానికి కారణం. భగవంతుడి మీద ఆశ పెంచుకో" అంటాడు.

          నీ దగ్గర పదికోట్ల రూపాయలున్నయనుకుందాం. భగవంతుణి నమ్మి మీ డబ్బంతా పేదలకు పంచి ఇచ్చేస్తే నిఛిత దొరుకుతుందా? రేపట్నుంచి ఈ దేశంలోని పేదవాళ్ళలో మీరు కూడా కలుస్తారు అంతే!

         డబ్బు ఉంటే ఏమేం చేయవచ్చు అన్నదైనా మీకు తెల్సు. భగవంతుడి వల్ల ఏమవుతింది? ఏం కాదు అనే విషయంలో మీకు అనుభవం లేదు.

        "సంతోషం కోసం ఆశ పడకు. స్వర్గం కోసం ఆశ పడు. అధికారం కావాలని ఆశ పడకు. ప్రశాంతత కావాలని ఆశపడు" అంటూ అవేవో సందేశాలు వస్తూనే ఉంటాయి.

        శంకరన్ పిళ్ళైకి ఒకసారి తాళలేని నడుంనొప్పి వచ్చింది. డాక్టర్ ఎక్ష్సరేని వెలుతుర్లో పరీక్షించాడు.

"ఈ ఎక్ష్సరే చూశారా? మీ వెన్నుముక బాగా దెబ్బతింది. ఆపరేషాన్ చేయాలి" అన్నాడు డాక్టర్.
     
      "ఎంత ఖర్చవుతుంది డాక్టర్?"

      " నా ఫీజు రూ.25,000. ఆస్పత్రిలో ఆరువారాలైనా వండి రెస్ట్ తీసుకోవాలి" అని చెప్పాడు డాక్టర్.

పిళ్ళైకి ఏం చేయాలో తోచలేదు. అంత డబ్బు ఎలా వస్తుంది."ఇప్పుడే వస్తాను డాక్టర్" అంటూ ఎక్ష్సరే తీసిన వ్యక్తి దగ్గరకు వెళ్లాడు. అతనికి రూ.25 ఇచ్చి "ఓ గంటలో నా వ్యాధి తగ్గిపోయేలా ఈఎక్ష్సరేని మార్చగలవేమో చూడు"
   
           అలాంటి ఎక్ష్సరేల్ని మార్చగలిగే సన్న్యాసులు లేక స్వాములే ఆశల్ని ఒకదాన్నుంచి మరొకదానికి మార్చుకోమని చెబుతారు. అయన కాకపోతే మరొక స్వామి రావచ్చు. అయన "సరే... ఆశను పూర్తిగా త్యజించనక్కరలేదు.కొద్దికొద్దిగా ఎదోకాస్త తక్కువ ప్రయాణంలో అయితే పర్వాలేదు" అంటూ అనుమతిస్తాడు.

           "కావాలనుకుంటే... నేనింకా వజ్రాలు సంపాదించగలను,కానీ,నాకు ఇదే చాలు" అని ఒక వజ్రంతో తృప్తిపడితే మెచ్చుకోవచ్చు. అది సంతృప్తినీ, అనందాన్నీ ఇవ్వవచ్చు. అయితే, "నాకవన్నీ ఎక్కడ అందుతాయి?ఇదే చాలు" అంటూ తాత్వికంగా మాట్లడి, నీ ఆశలరెక్కల్ని కత్తిరించుకుంటే, అది పిరికితనం.

"పక్కింటివాడు పేరాశగాడు. అయినా వాడికన్నీ లభిస్తున్నాయి. నేను ఆశపడుతున్నదే ఏదో కొంచెం. అదీ నాకు దక్కడం లేదు!" అనే బాధే మిగులుతుంది.

          అందుకే చెప్తున్నాను. మీరు ఆశలు పెంచుకోండి. చాలా ఎక్కువ ఆశలు పెంచుకోండి. ఆ ధైర్యం కూడా లేకుండా, అల్పత్వం పెంచుకొని ఆశల్ని చంపుకుంటే, జీవితంలో మీరే దేన్ని సాధించలేరు.

           మీ జీవనస్థాయిని నిర్ణయం ఆశల్ని గురించి మరింత వివరంగా వచ్చేవారం తెలుసుకుందాం.


                                                                         మౌనంతో రహస్యం
                                                                        సద్గురు జగ్గీ వాసుదేవ్