Sunday, November 24, 2013

తిరుపతి లడ్డు

లడ్డు పేరు చేబితే వేంటనే టక్కున గుర్తోచ్చేది మన తిరుపతి లడ్డు.సామాన్యుల నుండి కోట్లకు పడగలేత్తిన భాగ్యవంతుడి వరకూ ఎంతో భక్తిభావంతో ఆరగించి తినేది తిరుపతి లడ్డు.లడ్డూలంటే మన తిరుపతి లడ్డూలే ఆరుచి మన నాలుకను చేరుకొగానే మనసంతా ఒక్కసారి భక్తిభావంతో పులకరించి మయమరుస్తుంది.శ్రీవారి ప్రసాదంలో దద్దోజనం,పోంగలి వంటివెన్నున్నా తిరుపతి లడ్డూకున్న గిరాకితో పోలిస్తే ఇవేవి సరిపోవు.

ఎవరెంత కొపంతో ఉన్నా వారికి తిరుపతి లడ్డూ ఇస్తే ఇట్టే కరిగిపొతారు.ఏపని సాదించడానికి అయిన అంతటి బ్రహ్మస్త్రం మన లడ్డూ.పూర్వకాలం నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు పంచుతున్నా 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలయినపుడు మనం ఇపుడు చూసే లడ్డూ తయారి మొదలైంది. దీన్ని తయారుచేయడానికి ప్రత్యెక పద్దతి అంటూ ఒకటి ఉంది.లడ్డూ తయారు చేయడానికి వాడె సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు.ఈదిట్టం స్కేలును 1950లో మొదట రూపొందించగా భక్తులతాకిడిని బట్టి దీనిని 2001లో సవరించారు.ఇపుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు.

శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడేఅ సరుకులు -
ఆవు నెయ్యి - 165 కిలోలు
శెనగపిండి - 180 కిలోలు
చక్కెర - 400 కిలోలు
యాలుకలు - 4 కిలోలు
ఎండు ద్రాక్ష - 16 కిలోలు
కలకండ - 8 కిలోలు 
ముంతమామిడి పప్పు -30 కిలోలుఈ మిశ్రమంలో సుమారు 5,100 లడ్డూలు వరకూ తయారవుతాయి.శ్రీవారి ఆలయం ఆగ్నేయదిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15000 వరకూ లడ్డూలు తయారవుతాయి.తొలి రోఅజుల్లో లడ్డూలను కట్టెలపొయ్యి మీద తయారుచేసేవారు.అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాలను ప్రవేశపెట్టారు.వీటివల్ల కొంచెం రుచి,నాణ్యత తగ్గినా గిరాకి మాత్రం తగ్గలేదు.ఈ మద్యే మన లడ్డూకు పేటెంట్ హక్కు కూడా లభించింది.
ఆలయంలో లభించే లడ్డూలు మూడు రకాలు
1.ఆస్ధానం లడ్డూ - వీటిని ప్రత్యేక వుత్సవాలు సందర్భంగా మాత్రమే తయారుచేస్తారు.ప్రత్యేక అతిధులకు మత్రమే వీటిని అందజేస్తారు.
2.కళ్యాణోత్సవ లడ్డూ - దీనిని కళ్యాణోత్సవాల సమయంలో ఉత్సవాల్లో పాల్గోనే భక్తులకు అందజేస్తారు.
3.ప్రోక్తం లడ్డూ - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు.

No comments:

Post a Comment